Balakrishna - Dil raju: 'NBK 111' దిల్‌రాజుతో నిజమేనా?

ABN , Publish Date - Jul 24 , 2024 | 10:52 AM

దిల్‌ రాజు (Dil raju) టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల్లో ఒకరు. కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్‌ ఆయన నిర్మాణ సంస్థ. టాలీవుడ్‌లో చిరంజీవి, బాలకృష్ణ (Balakrishna) మినహా అగ్ర హీరోలు అందరితో ఆయన సినిమాలు తీశారు.

దిల్‌ రాజు (Dil raju) టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల్లో ఒకరు. కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్‌ ఆయన నిర్మాణ సంస్థ. టాలీవుడ్‌లో చిరంజీవి, బాలకృష్ణ (Balakrishna) మినహా అగ్ర హీరోలు అందరితో ఆయన సినిమాలు తీశారు. ఇప్పుడు ఆ లోటు కూడా తీర్చుకొనే ప్రయత్నాల్లో ఉన్నారాయన. ప్రస్తుతానికి బాలకృష్ణతో (NBK111)ఓ సినిమా చేయడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని తెలిసింది. అందుకోసం కొన్ని కథలు సిద్థం చేయిస్తున్నట్టు సమాచారం. తాజాగా దిల్‌ రాజు, బాలకృష్ణ కోసంకొన్ని కథలు విన్నారని, అందులో బాలయ్యకు ఏది నచ్చితే ఆ కథతో సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్‌ నడుస్తోంది. ఈమధ్య బాలయ్య కథల్ని ఆయన తనయ తేజస్విని వింటున్నారు. ఆమెకు నచ్చితే.. ఆ కథ బాలయ్య వరకూ వెళ్తోంది. బ్రాహ్మణి కూడా కొన్ని కథల్ని విన్నారని, అందులో ఒకటి నచ్చిందని, ఇదే కథ బాలయ్యకు నచ్చితే.. పట్టాలెక్కడం ఖాయమని ఇన్‌ సైడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు బాలయ్యకు కథ చెప్పిన దర్శకుడు ఎవరన్నది సస్పెన్స్ . దిల్‌ రాజు బ్యానర్‌లో బాలకృష్ణ ఎప్పుడో సినిమా చేయాల్సి ఉంది.. బాలయ్య వందో సినిమా చేయడానికి అప్పట్లోనే దిల్‌ రాజు గట్టిగా ప్రయత్నించారు. ఎందుకో వర్కవుట్‌ కాలేదు. ఇన్నాళ్లకు మళ్లీ అవకాశం వచ్చింది. ఈసారి ఎలాగైనా ఆయనతో సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాలన్న బలమైన కోరికతో ఉన్నారు ఉన్నారు. ‘భగవంత్‌ కేసరి’ బాలకృష్ణ నటించిన 108వ చిత్రం.  బాబితో చేసే సినిమా 109. బోయపాటి సినిమా 110. అవుతుంది. 111వ సినిమా దిల్‌ రాజు బ్యానర్‌ లో తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Updated Date - Jul 24 , 2024 | 03:15 PM