David Warner: తెలుగు సినిమాలో వార్నర్ మామ 'తగ్గేదే లే'
ABN , Publish Date - Oct 09 , 2024 | 11:02 AM
స్టార్ హీరోలు బన్నీ, మహేష్ బాబు తదితరులు కూడా వార్నర్‌కి రెస్పాండ్ కావడంతో తెలుగు ప్రజలు ఆయనని తెలుగు సినిమాలో చూడాలని ఎంతోగా కోరుకున్నారు. ఈ నేపథ్యంలోనే వార్నర్ ఓ స్టార్ హీరో తెలుగు సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఎవరు.. సినిమా ఏంటంటే?
ఆస్ట్రేలియన్ డ్యాషింగ్ ఓపెనింగ్ బాట్స్మెన్ డేవిడ్ వార్నర్(David Warner)కి తెలుగు సినిమా అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టేడియంలో విధ్వంసకర ఆటతీరుతో శత్రువుల గుండెలను హడలెత్తించే వార్నర్ ఇప్పుడు ఓ తెలుగు సినిమాలో కనపడనున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన డేవిడ్ తెలుగు ప్రేక్షకులకి ఎంతో దగ్గరయ్యాడు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో తెలుగు సినిమాల రీల్స్ అండ్ డైలాగ్స్ రిక్రియేట్ చేస్తూ వైరల్ కంటెంట్ సృష్టించాడు. అలాగే స్టార్ హీరోలు బన్నీ, మహేష్ బాబు తదితరులు కూడా వార్నర్‌కి రెస్పాండ్ కావడంతో తెలుగు ప్రజలు ఆయనని తెలుగు సినిమాలో చూడాలని ఎంతోగా కోరుకున్నారు. ఈ నేపథ్యంలోనే వార్నర్ ఓ స్టార్ హీరో తెలుగు సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఎవరు.. సినిమా ఏంటంటే?
డేవిడ్ వార్నర్ ఈ మధ్యన వరుసగా తన సోషల్ మీడియా పోస్టులలో 'ఆఫ్ టూ షూట్' అంటూ స్టోరీ పెడుతున్నారు. ఈ క్రమంలో అందరు ఆయన ఇండియన్ సినిమా షూట్‌లోనే ఉన్నట్లు భావించారు. అయితే డేవిడ్ వార్నర్.. రాజమౌళి లేదా సుకుమార్ సినిమాలో నటిస్తారని అంతా భావించారు. కానీ డేవిడ్.. నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న 'రాబిన్ హుడ్' సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో వార్నర్ విలన్‌గా కనిపించే అవకాశాలున్నట్లు టాక్. అలాగే దర్శకుడు వెంకీ కుడుముల వార్నర్ కోసం ప్రత్యేకంగా ఓ కామెడీ ట్రాక్ కూడా రాసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో మొదట్లో హీరోయిన్‌గా రష్మికను అనుకున్న తర్వాత శ్రీలీలాని ఫిక్స్ చేశారు.
అల్లు అర్జున్(Allu Arjun) సెన్సేషనల్ సాంగ్ 'బుట్టబొమ్మ' సాంగ్ ని వార్నర్ మొదటిసారి ఫ్యామిలీతో కలిసి రీల్ చేశారు. ఇది విపరీతమైన వైరల్ అయ్యింది. తర్వాత పుష్ప, బాహుబలి, గుంటూరు కారం, పోకిరి లాంటి చిత్రాల డైలాగ్స్ ని రీక్రియెట్ చేశాడు. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోస్ మహేష్ బాబు, అల్లు అర్జున్ డైరెక్టర్ పూరి జగన్నాద్ డేవిడ్ ని శబాష్ అన్నారు. ఐపీఎల్ తర్వాతి సీజన్లలో డేవిడ్ హైదరాబాద్ కి దూరమైనా తెలుగు ప్రజలకి దూరం కాలేదు, ఈ క్రమంలోనే ప్రముఖ క్రెడిట్ కార్డు సంస్థ డేవిడ్ వార్నర్, రాజమౌళిలతో కలిసి ఓ యాడ్ షూట్ చేశారు. అది కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది.