Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా..
ABN , Publish Date - Dec 26 , 2024 | 07:08 PM
Revanth Reddy: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో సీఎం రేవంత్ రెడ్డి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఆయన ఫేవరేట్ హీరో ఎవరో మీకు తెలుసా..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం సినిమా వార్తల ట్రెండింగ్ లోను నిలుస్తున్నాడు. ఓ వైపు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్, సినీ ప్రముఖులతో భేటీ వంటి అంశాలతో ఆయన హాట్ టాపిక్ గా మారారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఆయన గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఆయన ఫేవరేట్ హీరో ఎవరో మీకు తెలుసా..
సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు (గురువారం) ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సినీ ప్రముఖులతో కలిసి ప్రభుత్వ నిబంధనలు వెల్లడించడమే కాకుండా సినీ ఇండస్ట్రీ సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రేవంత్ ఫేవరేట్ హీరో ఎవరు అంటూ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఈ వెతుకలాటలోనే ఓ పాత ఇంటర్వ్యూ బయటపడింది. ఇందులో యాంకర్ మీ ఫేవరేట్ హీరో ఎవరని ప్రశ్నించగా రేవంత్ సమాధానమిస్తూ.. " ఇప్పుడు సినిమాలు చూడటం తక్కువ చేశాను. సో, ఈ జెనరేషన్ లో ఎవరు లేరు. కానీ.. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు చాలా ఎక్కువగా చూసే వాడిని. ఆయనే నా ఫేవరేట్ హీరో" అని చెప్పుకొచ్చారు.
ఇక ఈరోజు భేటీ విషయానికొస్తే.. సినిమా ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలిస్తూ.. ‘‘సినీ పెద్దలు చిత్ర పరిశ్రమ సమస్యలను మా దృష్టికి తెచ్చారు. వారి అనుమానాలు, అపోహలు, ఆలోచనలను మాతో పంచుకున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చింది. ‘పుష్ప2’ సినిమాకు పోలీస్ గ్రౌండ్ ఇచ్చాం. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పరిశ్రమ బాగుండాలని కోరుకున్నాం. ఐటీ, ఫార్మాతోపాటు చిత్ర పరిశ్రమ కూడా మాకు ముఖ్యం. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశాం. ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండేందుకు నిర్మాత దిల్ రాజును ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నియమించాం. పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. సినీ పరిశ్రమ సైతం కమిటీని ఏర్పాటు చేసుకోవాలి" అంటూ పలు సూచనలు ఇచ్చారు.