Paradha: అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’.. రత్నమ్మగా సంగీత

ABN , Publish Date - Jul 30 , 2024 | 10:11 AM

అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘పరదా’ . తాజాగా ఈ సినిమా నుంచి సంగీత లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు

Paradha: అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’.. రత్నమ్మగా సంగీత

‘సినిమా బండి’ సినిమాతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల (Praveen kandregula). ఇప్పుడాయన నుంచి వస్తోన్న రెండవ చిత్రం ‘పరదా’ (Paradha) తో మరో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నారు. లేడి ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వెరీ ట్యాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), వెర్సటైల్ యాక్టర్ దర్శన రాజేంద్రన్ (Darshana Rajendran), సీనియర్ నటి సంగీత (sangitha) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టైటిల్ లుక్, కాన్సెప్ట్ వీడియో మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ సినిమాలోని సంగీత లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ పాత్రలకు సై అన్నట్లుగా ‘టిల్లు స్క్వేర్’తో క్లారిటీ ఇచ్చేసింది. కానీ ఈ సినిమాలో ఓ డిఫరెంట్ పాత్ర చేసినట్లుగా ఇప్పటికే విడుదలైన ఆమె లుక్ చెబుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. అంతేకాక ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో కూడా ఇదొక వైవిధ్యభరిత చిత్రమని తెలియజేసింది.


paradha.jpeg

తాజాగా ఇప్పుడు వచ్చిన సీనియ‌ర్ న‌టి సంగీత ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. సంగీత ఈ చిత్రంలో రత్నమ్మగా మేకర్స్ పరిచయం చేశారు. ఈ లుక్‌లో సంగీత హోమ్లీగా, గరిటెలు పట్టుకుని వంట గదిలో నవ్వుతూ కనిపిస్తున్నారు. ఆమె పాత్ర ఈ సినిమాకు ఎంతో కీలకంగా అనేది కూడా ఈ లుక్ తెలియజేస్తోంది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లలోని కొన్ని గ్రామాలలో అద్భుతమైన ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ జరప‌గా గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మాతలుగా ఆనంద మీడియా ఈ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది.

Updated Date - Jul 30 , 2024 | 10:11 AM