Kiran Abbavaram: 'క' సినిమాలో సెకండ్ హైయెస్ట్ పెయిడ్ ఎవరో తెలిస్తే షాకవుతారు

ABN , Publish Date - Jul 20 , 2024 | 12:24 PM

'క' సినిమాలో అందరు నటీనటులతో పాటుగా ఒక డాగ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అయితే ఈ డాగ్ ని ఎక్కడ నుండి తీసుకు వచ్చారు, ట్రైనింగ్ ఎలా ఇచ్చారు, దాని వెనకాల వుండే నేపధ్యం ఏంటి... అన్నీ తెలుసుకోండి

Kiran Abbavaram and the dog from the film Ka

కిరణ్ అబ్బవరం నటించిన 'క' సినిమా నుండి కొన్ని రోజుల క్రితం టీజర్ విడుదలైంది. ఆసక్తికరంగా వున్న ఈ టీజర్ చూశాక, సినిమా వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది. సుజిత్, సందీప్ లు ఇద్దరూ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సాయంత్రం మూడు గంటలు అవగానే ఆ గ్రామంలో చీకట్లు ముసురుకోవటం టీజర్ లో చూసాం. అలాగే కిరణ్ అబ్బవరం ఇందులో పోస్ట్ మేన్ గా కనిపిస్తాడు. ఒక వైవిధ్యమైన లుక్స్ తో ఈ సినిమా అతను వుండబోతున్నట్టుగా అర్థం అవుతోంది.

kamoviedongtrained.jpg

అయితే ఈ టీజర్ లోనే ఒక డాగ్ ని కూడా చూస్తాము. ఆ డాగ్ సినిమాలో ఒక భాగం అని చెపుతున్నాడు కిరణ్ అబ్బవరం. మామూలుగా అయితే సినిమాలో కుక్కలు కావాలంటే ట్రైనింగ్ పొందిన డాగ్స్ ని తీసుకువస్తూ వుంటారు. కానీ ఈ సినిమాలో నటించిన డాగ్ మాత్రం ఆలా వచ్చింది కాదు. "అది ఒక స్ట్రీట్ డాగ్, దాన్ని తెచ్చి సుమారు 8 నెలలు నేనే ట్రైనింగ్ ఇచ్చాను. నా దగ్గర ఉండేట్టు చేసుకున్నాను, ఆ తరువాత కొన్ని నెలలు దానికి సరైన ఆహారం అది ఇచ్చి నా దగ్గర అది పూర్తిగా మచ్చిక అయ్యాక, పూర్తి ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు సినిమా చిత్రీకరణ కోసం దానితో పని చేశాం," అని చెప్పారు కిరణ్ అబ్బవరం.

kiranabbavaram2.jpg

ప్రస్తుతం ఈ డాగ్ కిరణ్ అబ్బవరం ఇంట్లో వుంది. ఈ సినిమాలో సెకండ్ హైయెస్ట్ పైడ్ యాక్టర్ ఎవరైనా వున్నారు అంటే అది ఈ డాగ్ మాత్రమే అని సరదాగా చిత్ర యూనిట్ సభ్యులు అనుకుంటూ వుంటారు. ఎందుకంటే స్ట్రీట్ డాగ్ అయినా, దానికి మంచి ఆహారం, దాని బాగోగులు చూసేందుకు గాను చాలా ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆ డాగ్ రోజూ మాంసాహారం లేకపోతే ముద్ద ముట్టదు అని తెలిసింది. అందుకని ఈ డాగ్ సెకండ్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఈ సినిమాలో అని అంటూ వుంటారు చిత్ర యూనిట్. సినిమాలో ఈ డాగ్ ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని కూడా తెలిసింది.

Updated Date - Jul 20 , 2024 | 12:25 PM