Ayushmann Khurrana Wife Health: రెండో సారి క్యాన్సర్ భార్యకు ధైర్యం చెప్పిన హీరో
ABN , Publish Date - Apr 08 , 2025 | 03:54 AM
బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా సతీమణి తహీరా కశ్యప్ మరోసారి రొమ్ము క్యాన్సర్ బారినపడ్డారు. ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆమె ఈ విషయాన్ని బయటపెట్టుతూ ధైర్యంగా ముందుకు వెళ్లాలంటూ సందేశం ఇచ్చారు
Ayushmann Khurrana Wife Health: బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా సతీమణి, నటి, దర్శకురాలు తహీరా కశ్యప్ రెండోసారి క్యాన్సర్ బారిన పడ్డారు. తనకు తిరిగి రొమ్ము క్యాన్సర్ సోకినట్టు ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఎటువంటి అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళ్లాలని తహీరా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తహీరా తన రొమ్ము క్యాన్సర్ విషయం వెల్లడించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలని కోరారు. భార్య పెట్టిన పోస్ట్‌కు వెంటనే స్పందిస్తూ ‘మై హీరో’ అని కామెంట్ పెట్టారు. 2018 లో ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్లు నిర్దారణ అయింది. ఇక అప్పటినుంచి చికిత్సలో భాగంగా జరిగే ప్రతి చర్యనీ ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటూ తనలా క్యాన్నర్‌తో బాధ పడేవారికి ధైర్యాన్ని ఇచ్చారు.