Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’.. ఎక్సయిటింగ్ అంశాలివే..

ABN , Publish Date - Jun 26 , 2024 | 07:40 PM

హైలీ యాంటిసిపేటెడ్ మాగ్నమ్ ఓపస్ చిత్రం ‘కల్కి 2898 AD’ యూనిక్ స్టోరీ లైన్, థీమ్, బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్‌తో ఇండియన్ సినిమాలో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుద‌ల‌కు ఇంకొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ సినిమాకు సంబంధించి వస్తోన్న ఎక్సయిటింగ్ అంశాలతో సోషల్ మీడియాలో ‘కల్కి 2898 AD’ పేరు మారుమోగుతోంది.

Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’.. ఎక్సయిటింగ్ అంశాలివే..
Prabhas in Kalki 2898 AD Movie

హైలీ యాంటిసిపేటెడ్ మాగ్నమ్ ఓపస్ చిత్రం ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) యూనిక్ స్టోరీ లైన్, థీమ్, బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్‌తో ఇండియన్ సినిమాలో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుద‌ల‌కు ఇంకొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ సినిమాకు సంబంధించి వస్తోన్న ఎక్సయిటింగ్ అంశాలతో సోషల్ మీడియాలో ‘కల్కి 2898 AD’ పేరు మారుమోగుతోంది. ఆ ఎక్సయిటింగ్ అంశాలేంటో చూద్దామా..

‘కల్కి 2898 AD’ మోస్ట్ ఎక్సయిటింగ్ అంశాలలో ఒకటి ఇండియన్ సినిమాకు చెందిన ఇద్దరు లెజెండ్స్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్ (Kamal Haasan) 39 సంవత్సరాల తర్వాత రీయూనియన్ కావడం. వీరిద్దరూ 1985 కల్ట్ క్లాసిక్ ‘గెరాఫ్తార్‌’లో స్క్రీన్‌ షేర్ చేసుకున్నారు. బ్రదర్స్ కరణ్, కిషన్ పాత్రలను పోషించారు. 13 సెప్టెంబరు, 1985న విడుదలైన ఈ చిత్రం నేటికీ అందరికీ ఇష్టమైన క్లాసిక్‌గా నిలిచింది.

Also Read-Kalki 2898AD Review: మహాభారత యుద్ధం తరువాత ఏమి జరిగిందో ఊహాత్మకంగా...

‘కల్కి 2898 AD’లో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రను పోషించారు. ఈ క్యారెక్టర్‌లో కమల్ హసన్ లుక్, గెటప్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు, అలాంటి పాత్ర చేయగల ఏకైక నటుడు కమల్ హాసన్ మాత్రమే అనేలా ప్రతి ఒక్కరి నోటా వినబడుతోందంటే.. నాగ్ అశ్విన్ (Nag Ashwin) సెలక్షన్ సూపర్ అని అంగీకరించాల్సిందే. సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్‌లో కమల్ హసన్ మేకోవర్ అన్ బిలివబుల్ అండ్ స్టన్నింగ్‌గా వుంది. మునుపెన్నడూ చూడని మైండ్ బ్లోయింగ్ అవతార్‌లో కమల్ హాసన్ అద్భుతం చేయబోతున్నారు. (Kalki 2898 AD Ready to Release)


Kalki-Prabhas.jpg

ఇందులో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ‌గా కనిపించనున్నారు. ఈ లెజెండరీ స్టార్స్‌ని ఒకే ఫ్రేమ్‌లో కలిపి ఈ చిత్రం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. రెండు పాత్రల గ్లింప్స్ ప్రేక్షకులను కట్టిపడేయడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ఎక్సయిట్మెంట్ పెరుగుతూనే ఉంది.

కల్కి వినూత్న కథాంశం, స్టార్-స్టడెడ్ లైనప్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఆన్-స్క్రీన్ రీయునియన్ చూసే అవకాశం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి 2898 AD ఇండియన్ సినిమాపై గొప్ప ప్రభావాన్ని చూపడానికి సిద్ధంగా ఉంది. ఇది లెజెండరీ ట్యాలెంట్, భారతీయ పురాణాలను డిస్టోపియన్ ఫ్యూచర్‌తో బ్లెండ్ చేసిన గ్రౌండ్ బ్రేకింగ్ స్టోరీ టెల్లింగ్‌ని అందిస్తోంది.

తాజాగా నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించి ఓ సర్‌ప్రైజ్ అప్డేట్ ఇచ్చారు. అదేమంటే.. సినిమా క్లైమాక్స్‌లో ఓ సర్‌ప్రైజ్ సాంగ్ ఉంటుంది. సెకండాఫ్ 80 శాతం యాక్సన్ పార్టే ఉంటుంది. ప్రభాస్ పాత్ర సినిమా మొదలైన 20 నిమిషాల తర్వాతే వస్తుంది. అయినా కూడా ఇంతకు ముందెన్నడూ ఉండని బెస్ట్ ఎంట్రీగా ఇందులో ప్రభాస్ (Rebel Star Prabhas) ఎంట్రీ ఉండబోతోంది.. అని నాగ్ అశ్విన్ తన ఇన్‌స్టా లైవ్‌లో చెప్పుకొచ్చారు.

ఇదే లైవ్‌లో ప్రభాస్ మాట్లాడుతూ.. ‘కల్కి 2898 AD’కి పార్ట్ 2 ఉందని, దీనికి సంబంధించిన వర్క్ 10 రోజులు రిలాక్స్ అయిన తర్వాత మొదలుపెట్టమని నాగ్ అశ్విన్‌ని కోరాడు. అలాగే ఇందులో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ నటించటం కూడా సినిమా స్థాయిని మరింత పెంచిందని చెప్పి.. నాగ్ అశ్విన్ ప్లాన్ చేసిన సర్‌ప్రైజ్‌ని ప్రభాస్ లీక్ చేశారు.

Read Latest Cinema News

Updated Date - Jun 26 , 2024 | 07:43 PM