Kiara adwani: ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం అదే!

ABN , Publish Date - May 21 , 2024 | 10:55 AM

‘కేన్స్‌ చిత్రోత్సవాల్లో (Cannes Film Festival) సందడి చేస్తున్నారు కియారా అడ్వాణీ (Kiara adwani). ప్రపంచ సినిమా ప్రతిష్టాత్మకంగా భావించే ఈ వేడుకలో పాల్గొనడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాని చెబుతున్నారామె.

Kiara adwani:  ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం అదే!

‘కేన్స్‌ చిత్రోత్సవాల్లో (Cannes Film Festival) సందడి చేస్తున్నారు కియారా అడ్వాణీ (Kiara adwani). ప్రపంచ సినిమా ప్రతిష్టాత్మకంగా భావించే ఈ వేడుకలో పాల్గొనడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాని చెబుతున్నారామె. కేన్స్‌ వేదికపై తనదైన శైలి డ్రెసింగ్‌తో మెరిసి ఆహుతులను అలరించింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ‘ఉమెన్‌ ఇన్‌ సినిమా’ అంశంపై జరిగిన చర్చలో  ఆమె పాల్గొన్నారు. అనంతరం ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన అనుభవాలను, రాబోవు చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. (Game Changer)

ముఖ్యమైనది అయితేనే...
‘ఎన్నో భిన్నమైన పాత్రలు ఎంచుకుని, నన్ను నేను నిరూపించుకుంటూ చిత్రపరిశ్రమలో విజయవంతంగా 10ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఈ పదేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను అధిగమించి ( ఈరోజు ఈస్థాయిలో ఉన్నాను. (10 Year of Kiara) ఇప్పుడిప్పుడే మరింత కొత్త కథల వైపు అడుగేస్తున్నా. వాటితోనే ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. కానీ చేసే క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స లేని ప్రాజెక్టుల్లో భాగం కావాలని కోరుకోను. కథలో విషయం ఉండాలి. పోషించే పాత్ర సినిమాకి ముఖ్యమైనదై ఉంటేనే అందులో నటించడానికి ఆసక్తి చూపిస్తుంటాను’.

Kiara-2.jpg

మధురమైన జ్ఞాపకంగా...
కేన్స్‌ చిత్రోత్సవాలకు హాజరవ్వడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.  కానీ చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నా కెరీర్‌లోనే ఎంతో మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది. దాదాపు 20ఏళ్ల క్రితం నా కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యాను. చిన్నప్పుడు దీని గురించి ఇంటర్నెట్‌ ద్వారా తెలుసుకున్నా. కానీ.. నేను  ఒక సె?బ్రెటీగా ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేడుకలో పాల్గొంటానని ఆ సమయంలో నాకు తెలీదు.

ఈమె నటిస్తుందా? అని విమర్శించారు..
నాకు యాక్షన్  జానర్‌ చిత్రాలంటే ఇష్టం. చాలా రోజులుగా ఆ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా.  ‘వార్‌ 2’, ‘డాన్‌ 3’లతో ఆ కోరిక నెరవేరబోతుంది. ఇవి నా కెరీర్‌లోనే పెద్ద  సినిమాలు. ప్రేమకథలు, కామెడీ..ఇలా అన్ని జానర్లలో పనిచేశాను. కానీ చాలా కాలంగా పూర్తిగా యాక్షన్‌ నేపథ్యంలో సాగే చిత్రాల్లో నటించడం కోసం వేచి చూస్తున్నాను. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. ఒకానొక సమయంలో ‘షేర్షా’ సినిమాలో నేను భాగమైనప్పుడు.. ‘ఓ మై గాడ్‌ ఇదొక యుద్థానికి సంబంధించిన యాక్షన్‌ చిత్రం. ఇలాంటి ప్రాజెక్టులో ఈమె నటిస్తుందా..?’ అని కొంతమంది నా మీద కామెంట్స్‌ చేశారు. కానీ.. ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న రెండు పెద్ద సినిమాలు నా చేతుల్లో ఉన్నాయి. ఈ చిత్రాల ద్వారా నన్ను నిరూపించుకోవాలి. ప్రస్తుతం నా ఎదుట ఉన్న లక్ష్యం అదే.



Kiara.jpgఆ పాట మంచి అనుభవం..
అలాగే త్వరలోనే నేను నటిస్తున్న 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ‘జరగండి జరగండి’ పాటకు నాకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఇప్పటి వరకు నేను చేసిన వాటిల్లో ఇదే కష్టమైనది. దాదాపు 10 రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ జరిగింది. ఒక పాటకు ఇన్ని రోజుల షూటింగ్‌ ఇంతకు ముందెప్పుడు చేయలేదు. దీని కోసం షూటింగ్‌ తర్వాత కూడా 3 నుంచి 4గంటలపాటు రిహార్సల్స్‌ చేశాను. రామ్‌చరణ్‌ స్టెప్పులను మ్యాచ్‌ చేసేందుకు  ఇంకాస్త ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఇందులో చాలా కష్టమైన స్టెప్స్‌ ఉన్నా.. ఇది నాకొక మంచి అనుభవం దర్శకుడు శంకర్‌తో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా. సినిమాల పట్ల అంకితభావం ఉన్న వ్యక్తి ఆయన.  ఆయనలో ఇదే నాకు ఎక్కువగా నచ్చుతుంది’

ఇద్దరికీ ఇష్టమే..!
‘‘షేర్షా’ సినిమాతో సిద్థార్థ్‌కి, నాకు మంచి ప్రశంసలు వచ్చాయి. ప్రేక్షకులు మళ్లీ మమ్మల్ని జోడీగా తెరపై చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మేమిద్దరం కలిసి నటిస్తే  అది వర్కౌవుట్‌ అవుతుందా..? లేదా అనేది ఎప్పుడు ఆలోచించను. మా ఇద్దరికీ కూడా కలిసి పనిచేయడం చాలా ఇష్టం. కథ మమ్మల్ని ఉత్తేజపరిచేలా.. కొత్తదనంతో ఉండాలి. అలాంటి ప్రాజెక్టు కోసమే ఎదురుచూస్తున్నాము’.

Updated Date - May 21 , 2024 | 10:57 AM