Allu Arjun: యెద లోతుల నుండీ...
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:29 PM
కొందరి మధ్య ప్రేమ సంవత్సరాలు పెరిగే కొద్ది మరింతగా చిక్కబడుతుంది. అల్లు అర్జున్, స్నేహ మధ్య కూడా ఇలాంటి ప్రేమ బంధమే ఉంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), అతని భార్య స్నేహారెడ్డి (Sneha Reddy) మధ్య అనుబంధం చాలా బలమైంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈ జంట అప్పటి నుండి ఇప్పటి వరకూ ఒకే మాట ఒకే బాటగా సాగుతోంది. మంగళవారం అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా స్నేహారెడ్డి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. 43 సంవత్సరాల అల్లు అర్జున్ కు విషెస్ తెలియచేస్తూ, తామిద్దరూ, పిల్లలు దిగిన ఫోటోలతో ఓ వీడియోను స్నేహారెడ్డి చేసింది. ఇందులోని ఓ ఫోటో మాత్రం బన్నీ అభిమానులకు విశేషంగా నచ్చేసింది. స్నేహారెడ్డి, పిల్లలు స్కూటర్ మీద ఉండగా, వెనక దానిని పట్టుకుని గాల్లో తేలుతున్న అల్లు అర్జున్ ఇచ్చిన ఫోజ్ భలే ఉంది. అయితే... ఇలాంటి ఫోటోనే గతంలోనూ స్నేహారెడ్డి పోస్ట్ చేసింది. ఈ రెండు ఫోటోలను కలిపి, అప్పుడూ ఇప్పుడూ అంటూ కొందరు నెటిజన్స్ కలిపి పోస్ట్ చేశారు. 'అల్లు అర్జున్ బలం స్నేహారెడ్డే!' అని అభిమానులు ఆనందంగా కామెంట్స్ పెట్టడం విశేషం.
Also Read: Manchu Vishnu: యోగి ఆవిష్కరించిన కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్
Also Read: Trisha - Charmy: ఈనాటి ఈ బంధమే నాటిదో...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి