Sarfira Trailer: అక్ష‌య్ కుమార్ ‘ఆకాశం నీ హద్దురా’ హిందీ రీమేక్.. ట్రైల‌ర్ విడుద‌ల‌

ABN , Publish Date - Jun 18 , 2024 | 05:09 PM

బాలీవుడ్ యాక్ష‌న్ హీరో అక్ష‌య్ కుమార్ హీరోగా రూపొందిన కొత్త‌ చిత్రం సర్ఫిరా. 2020లో సూర్యా హీరోగా వ‌చ్చిన సూరరై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) చిత్రానికి హిందీ రీమేక్‌గా తెర‌కెక్కింది. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

Sarfira Trailer: అక్ష‌య్ కుమార్ ‘ఆకాశం నీ హద్దురా’ హిందీ రీమేక్.. ట్రైల‌ర్ విడుద‌ల‌
Sarfira Trailer

బాలీవుడ్ యాక్ష‌న్ హీరో అక్ష‌య్ కుమార్ (Akshay Kumar) హీరోగా రూపొందిన కొత్త‌ చిత్రం సర్ఫిరా (Sarfira). 2020లో సూర్యా (Suriya) హీరోగా వ‌చ్చిన సూరరై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) చిత్రానికి హిందీ రీమేక్‌గా తెర‌కెక్కింది. మాతృక‌ల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తెలుగు డైరెక్ట‌ర్‌ సుధా కొంగ‌ర (Sudha Kongara) ఈ చిత్రానికి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేషం. సూర్య 2D ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ (2D Entertainment), అక్షయ్ కుమార్ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ (Cape Of Good Films) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌గా జీవీ ప్ర‌కాశ్ కుమార్ (G. V. Prakash Kumar) సంగీతం అందించారు.

GQVk6dhXkAAYtj7.jpeg

తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంటోంది. అతి త‌క్కువ ఖ‌ర్చుతో సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు విమాన సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకు రావాల‌ని ప్ర‌య‌త్నించే ఓ యువ‌కుడి క‌థ నేప‌థ్యంలో సినిమా సాగుతుంది.

GQVsyCta8AAaMEU.jpeg

నిజ జీవిత ఘ‌ట‌న‌ల అధారంగా చేసుకుని సుధ కొంగ‌ర ఈచిత్రాన్ని మొద‌ట త‌మిళంలో రూపొందించింది. తీరా సినిమా విడుద‌ల‌య్యే స‌మ‌యానికి క‌రోనా వ‌ల్ల నేరుగా ఓటీటీలో విడుద‌లై మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. అదే చిత్రాన్ని కొద్ది మార్పుల‌తో అక్ష‌య్ కుమార్ (Akshay Kumar) , రాధికా మ‌ద‌న్ (Radhika Madan) జంట‌గా హిందీలో రీమేక్ చేశారు.


GQVp4YOXQAA1o6I.jpeg

ఇప్ప‌టికే అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో తాజాగా మంగ‌ళ‌వారం (జూన్ 18)న ట్రైల‌ర్ ను లాంచ్‌ చేశారు.ట్రైల‌ర్ చివ‌ర‌లో హీరో సూర్య (Suriya) క‌నిపించి స‌ర్‌ప్రైజ్ చేశారు. ఒరిజిన‌ల్‌లో మోహ‌న్‌బాబు న‌టించిన పాత్ర‌లో శ‌ర‌త్ కుమార్ క‌నిపించ‌గా బాలీవుడ్ న‌టుడు ప‌రేశ్‌ రావెల్ (Paresh Rawa) అదే పాత్ర‌లో క‌నిపించారు.

Updated Date - Jun 18 , 2024 | 05:18 PM