Dasara: నాని రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
ABN , First Publish Date - 2023-04-01T11:35:39+05:30 IST
'దసరా' సినిమా నానికి ప్రత్యేకం ఎందుకంటే ఈ సినిమా ఒకేసారి చాల భాషల్లో విడుదల అవటమే కాకుండా, బడ్జెట్ పరంగా కూడా పెద్ద సినిమా నాని కి. అయితే ఈ సినిమాకి నాని పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు...
నాని (Nani) నటించిన 'దసరా' (Dasara) సినిమా మార్చి 30 న విడుదల అయింది. ఈ సినిమా మిక్సిడ్ టాక్ వచ్చినా మొదటి రోజు కలెక్షన్స్ అదరగొట్టింది. రెండో రోజు కొంచెం తగ్గినా, శని ఆదివారాలు బాగుంటాయి అని అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాల రికవరీ అయిపొయింది. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దీనికి దర్శకుడు కాగా, కీర్తి సురేష్ (Keerthy Suresh) ఇందులో కథానాయిక. గోదావరి ఖని (Godavarikhani) దగ్గర వున్న ఒక పల్లెలో జీవన శైలి ఏ విధంగా ఉంటుంది అన్న నేపధ్యం లో వచ్చిన ఒక ఫిక్షన్ కథ ఇది.
అయితే ఈ సినిమాకి నాని చాలా బాగా ప్రచారం చేసాడు. ఒక్కడే ప్రచారాన్ని అంతా భుజం మీద వేసుకొని అన్ని పట్టణాలకు వెళ్లి, హిందీ మాట్లాడే ప్రదేశాలకు కూడా వెళ్లి మరీ ప్రచారం చేసేది. ఈ సినిమాని అంతగా నమ్మి చేసాడు. ఈ సినిమాకి నిర్మాత చెరుకూరి సుధాకర్ (Cherukuri Sudhakar). అయితే ఈ సినిమాకి నాని రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు అందరూ. నాని రెమ్యూనరేషన్ (Nani remuneration) రూ.16 కోట్లు (Rs.16 crore) తీసుకున్నాడని పరిశ్రమలో చెపుతున్నారు.
నాని ఇంతవరకు ఇదే అత్యధిక పారితోషికం తీసుకోవటం అని కూడా చెపుతున్నారు. రూ.16 కోట్లు పారితోషికం అంటే నాని ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ యాక్టర్ల లిస్టు లోకి వచ్చేసినట్టే. ఈ సినిమాకి ఖర్చు కూడా చాలా తక్కువే అయిందని అంటున్నారు. ఎందుకంటే సినిమా మొత్తం ఒక గ్రామం సెట్ లో తీశారని చెప్పారు. ఆ గ్రామం సెట్ కి కూడా సినిమా నిర్వాహకులు చెప్పినంత అయి ఉండదని కూడా చెపుతున్నారు. నాని రెమ్యూనరేషన్ తప్పితే ఈ సినిమాకి పెద్దగా ఖర్చు లేదని కూడా చెపుతున్నారు.