Heroine Samantha: పారితోషికాల్లో వ్యత్యాసం ఎందుకు

ABN , Publish Date - Apr 15 , 2025 | 04:36 AM

హీరో-హీరోయిన్లకూ సమాన పాత్రలు ఉన్నా పారితోషికాల్లో వ్యత్యాసం ఎందుకని నటి సమంత ప్రశ్నించారు. ఈ అసమానతలను తొలగించే దిశగా తన సంస్థలో మార్పులు తీసుకొస్తున్నట్టు తెలిపారు

ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ ఒకేలా కష్టపడుతున్నప్పుడు పారితోషికాల్లో వ్యత్యాసం ఎందుకని నటి సమంత ప్రశ్నించారు. కథానాయికలు ఈ విషయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారని అన్నారు. సినీ పరిశ్రమలో నెలకొన్న ఈ అసమానతలపై సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘హీరో, హీరోయిన్‌ సమాన ప్రాతినిథ్యం ఉన్న పాత్రల్లో నటించినప్పటికీ పారితోషికం విషయంలో మాత్రం వ్యత్యాసం ఉంటోంది. పరిశ్రమలో నన్ను ఇబ్బందిపెట్టే విషయాల్లో ఇదొకటి. దీనిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా. గత పరిస్థితులను నేను మార్చలేను. మార్పు నాతోనే మొదలవ్వాలని నా సంస్థలో ఇలాంటి వ్యత్యాసం రాకుండా చూసుకుంటున్నాను’ అని చెప్పారు.

Updated Date - Apr 15 , 2025 | 04:37 AM