Jatt Movie Controversy: జాట్ దర్శకుడికి తమిళుల హెచ్చరిక
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:19 AM
తెలుగు దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కించిన హిందీ చిత్రం 'జాట్'పై తమిళుల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎల్‌టీటీఈని ఉగ్రవాద సంస్థలా చూపినందుకు సోషల్ మీడియాలో బహిష్కరణ డిమాండ్ చేస్తున్నారు
బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ హీరోగా తెలుగు దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘జాట్’. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవలె విడుదలైన ఈ చిత్రాన్ని బహిష్కరించాలని కోరుతూ సోషల్ మీడియా ‘ఎక్స్’లో ‘బాయ్‌కాట్ మూవీ’ హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. ఎల్‌టీటీఈని ఒక ఉగ్రవాద సంస్థగా ఈ సినిమాలో చిత్రీకరించారంటూ కొందరు తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో అడుగుపెడితే దర్శకుడు గోపిచంద్ మలినేనికి తగిన బుద్ధి చెబుతామంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమాలో ఎల్‌టీటీఈ పేరు ప్రస్తావించనప్పటికీ ఆ మార్క్ చూపుతూ సినిమా తీశారని కొందరు తమిళులు ఆరోపిస్తున్నారు.