Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..

ABN , First Publish Date - 2023-03-23T13:34:39+05:30 IST

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సంయుక్త మీనన్ (Samyuktha Menon).

Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..
Samyuktha Menon

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సంయుక్త మీనన్ (Samyuktha Menon). ఈ మలయాళ భామ పవన్ కల్యాణ్, రానా ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) తో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. అనంతరం కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘బింబిసార’ (Bimbisara)‌, తాజాగా ధనుష్ హీరోగా వచ్చిన ‘సార్’ (SIR) సినిమాలతో వరుస హిట్లు అందుకుంది. హ్యాట్రిక్ హిట్స్ సాధించడంతో ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో చాలామంది హీరోలు, దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో సంయుక్తని హీరోయిన్‌గా నటింపజేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు. దీంతో ఈ తారకి తెలుగులో వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.

సంయుక్త ఇప్పటికే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా చేస్తున్న ‘విరుపాక్ష’ (Virupaksha) మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ మూవీ మేకర్స్‌పై సోషల్ మీడియా వేదికగా సంయుక్త ఫైర్ అయ్యింది. ఎందుకు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యింది. సంయుక్త షేర్ చేసిన పోస్టులో.. ‘నా డిస్సాపాయింట్‌మెంట్ గురించి చేప్పేముందు.. నేను నా నిరుత్సాహాన్ని వ్యక్తం చేసే ముందు, విరూపాక్షతో నా ప్రయాణం చాలా బావుంది. అమేజింగ్ యాక్టర్స్, టెక్నిషియన్స్‌తో కలిసి పని చేయడం ఆనందంగా, గర్వంగా ఉంది. అయితే చిత్ర నిర్మాతలు ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. ఉగాది పర్వదినాన నా క్యారెక్టర్ పోస్టర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చారు కదా. ఏమైంది.. పోస్టర్ ఎక్కడా?’ అని ఎస్‌వీసీసీ సంస్థని ట్యాగ్ చేస్తూ తన నిరాశను వ్యక్తం చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

samyukhta1.jpg

సంయుక్త ట్వీట్‌కి నిర్మాణ సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్పందిస్తూ.. ఈ బ్యూటికి క్షమాపణలు మేకర్స్ చెప్పారు. ఎస్‌వీసీసీ ఇచ్చిన రిప్లైలో.. ‘దానికి క్షమాపణలు కోరుతున్నాం. దీనికి మాకు కొంచెం సమయం కావాలి’ అని రాసుకొచ్చారు. దానికి రిప్లై.. ‘సరే’ అంటూ ఎదురు చూస్తున్నట్లు ఎమోజీలను జోడిస్తూ రిప్లై ఇచ్చింది.

ఎస్‌వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి కార్తిక్‌ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆ టీజర్‌ని బట్టి మూఢనమ్మకాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. కాగా.. సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Updated Date - 2023-03-23T13:34:40+05:30 IST