#Tarakaratna: ప్రధాని నరేంద్ర మోదీ టు సీఎం కేసీఆర్.. తారకరత్న మృతికి రాజకీయ ప్రముఖులు సంతాపం

ABN , First Publish Date - 2023-02-19T12:37:03+05:30 IST

టాలీవుడ్ నటుడు, టీడీపీ నాయకుడు తారకరత్న (Tarakaratna) శనివారం (ఫిబ్రవరి 18న) రాత్రి మృతి చెందారు.

#Tarakaratna: ప్రధాని నరేంద్ర మోదీ టు సీఎం కేసీఆర్.. తారకరత్న మృతికి రాజకీయ ప్రముఖులు సంతాపం

టాలీవుడ్ నటుడు, టీడీపీ నాయకుడు తారకరత్న (Tarakaratna) శనివారం (ఫిబ్రవరి 18న) రాత్రి మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబంతో పాటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. తారకరత్న మరణ వార్త తెలిసిన ఎంతోమంది రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi), తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR), టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బిజేపీ నాయకుడు బండి సంజయ్‌తో పాటు పలువురు నివాళి తెలిపారు.

‘తారకరత్న గారి హఠాన్మరణం గురించి విని చాలా బాధ పడ్డాను. ఆయన సినీ, వినోద రంగంలో తనదైన ముద్ర వేశారు. కుటుంబానికి, సన్నిహితులకి నా ప్రగాఢ సానుభూతి’ అని ప్రధాని నరేంద్ర మోదీ రాసుకొచ్చారు.


ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

‘తారకరత్న మరణ వార్త నన్ను కలిచి వేసింది. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకి నా ప్రగాఢ సానుభూతి. వారికి మనో ధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాసుకొచ్చారు.


‘తెలుగు సినిమా నటుడు నందమూరి తారకరత్న గారి అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. తన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’ అని బీజేపీ తెలంగాణ నాయకులు బండి సంజయ్ రాసుకొచ్చారు.

Updated Date - 2023-02-19T12:37:07+05:30 IST