Pawan Kalyan: రికార్డు బ్రేక్ చేసిన పవన్ కళ్యాణ్

ABN , First Publish Date - 2023-03-25T15:59:51+05:30 IST

అగ్ర నటులు ఒక సినిమా పూర్తి చెయ్యడానికి నెలలు తరబడి తీసుకునే ఈ రోజుల్లో, పవన్ కళ్యాణ్ తన సినిమా కేవలం ఎన్ని రోజుల్లో పూర్తి చేసాడో తెలుసా....

Pawan Kalyan: రికార్డు బ్రేక్ చేసిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అటు రాజకీయాల్లో తన జనసేన పార్టీకి (Jana Sena) పనిచేస్తూనే, ఇటు సినిమాల్లో కూడా పని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో చాలా సినిమాలు వున్నాయి అయితే అయన ఒక్కొక్కటి పూర్తి చేసుకొని వస్తున్నాడు. ఈమధ్యనే దర్శకుడు సముద్రఖని (Samuthirakani) తో లాంచ్ అయిన కొత్త సినిమా పవన్ కళ్యాణ్ తన పార్ట్ పూర్తి చేసేసాడు అంటే నమ్మశక్యంగా లేదు కదా. కానీ అది నిజం, పవన్ ఈ 'వినోదయ సితం' (Vinodhaya Sitham) సినిమాకి తెలుగు రీమేక్ సముద్రఖని దర్శకత్వం లో చేస్తున్నాడు కదా. తన పోర్షన్ పూర్తి చేసేసాడు అని తెలిసింది.

Pawan-Final.jpg

ఇందులో తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కూడా వున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ కేవలం 24 రోజులు మాత్రం ఈ సినిమా పూర్తి చెయ్యడానికి తీసుకున్నాడు. ఇంత తక్కువ రోజులో ఈమధ్య కాలం లో పవన్ కళ్యాణ్ ఏ సినిమాని పూర్తి చెయ్యలేదు. రోజూ షూటింగ్ కి ఉదయాన్నే వెళ్లి మళ్ళీ రాత్రి వరకు చేసి, చాలా తక్కువ సమయం లో ఈ సినిమా పూర్తి చేసిన ఘనత పవన్ కళ్యాణ్ కి దక్కుతుంది. ఈ సినిమా జులై 28 (July 28) న విడుదల అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుండి టి.జి. విశ్వప్రసాద్ (TG Viswaprasad) ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

pk-sdt5.jpg

ఇది కాక పవన్ కళ్యాణ్ చేతిలో ఇంకా చాలా సినిమాలు వున్నాయి. క్రిష్ (Director Krish) దర్శకత్వం వహిస్తున్న 'హరి హర వీరమల్లు', (Harihara Veeramallu) హరీష్ శంకర్ (Harish Shankar) తో 'ఉస్తాద్ భగత్ సింగ్', (Ustaad Bhagath Singh) అలాగే దర్శకుడు సుజిత్ తో (Sujeeth) కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఒక సినిమా పూర్తి చేసాడు, ఇప్పుడు ఇంకో సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' ఏప్రిల్ 5 నుండి మొదలెడతాడు అని తెలుస్తోంది. తరువాత క్రిష్ సినిమా, అలాగే సుజీత్ తో కూడా షూటింగ్ చేస్తాడని తెలుస్తోంది.

Updated Date - 2023-03-25T15:59:52+05:30 IST