Vamshi Paidipally : బాలీవుడ్ బాట పట్టబోతున్న మరో టాలీవుడ్ డైరెక్టర్
ABN , Publish Date - Apr 14 , 2025 | 05:58 PM
డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ఆమిర్ ఖాన్ మూవీపై ఓ క్రేజీన్యూస్ చక్కర్లు కొడుతోంది. మిస్టర్ పర్ఫెక్ట్ తో మహర్షి తరహా మూవీని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
పాన్ ఇండియా లెవెల్‌లో మరో క్రేజీ ప్రాజెక్టు పట్టాలెక్కేలా కనిపిస్తోంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan), టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally)తో సినిమా వర్కవుట్ అయ్యేలా ఉందన్న టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం.. వంశీ చెప్పిన సింగిల్-లైన్ ప్లాట్ ఆమిర్‌ని ఫిదా చేసిందట. దీంతో పూర్తి స్క్రిప్ట్ కోసం ఆమిర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడని తెలుస్తోంది. వంశీ తన రైటర్స్ టీమ్‌తో స్క్రిప్ట్‌ని డెవలప్ చేస్తున్న స్టైల్ ఆమిర్‌కి బాగా నచ్చిందట. స్క్రిప్ట్ రెడీ అయిన వెంటనే మేకర్స్ ఆయనకు చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది.
కొంతకాలంగా వంశీ పైడిపల్లితో పాన్ ఇండియా ట్రావెల్ చేస్తున్న దిల్ రాజు (Dil Raju)నే ఈ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టుగా చెబుతున్నారు. ఇటీవల ఆయన ప్రొడ్యూస్ చేసిన 'గేమ్ చేంజర్' (Game Changer) నిరాశపరచడంతో.. ఈ సారి దిల్ రాజు పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కోసం జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఒకవేళ ఆమిర్ - వంశీ కాంబో సెట్ అయితే.. దిల్ రాజు ప్రొడక్షన్ వ్యాల్యూతో ఈ మూవీ ఓ స్టైలిష్ ఎంటర్‌టైనర్ అవుతుందని ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
ఆమిర్ ఖాన్ ఇంతకుముందు థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ (Thugs of Hindostan) , లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha)తో బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ రిజల్ట్స్ ఫేస్ చేశాడు. ప్రస్తుతం 'సితారే జమీన్ పర్' (sitaare zameen par), రజనీకాంత్‌తో 'కూలీ' (Coolie)లో క్యామియోతో బిజీగా ఉన్నాడు. లోకేశ్ కనగరాజ్, ఇతర తెలుగు డైరెక్టర్స్‌తో కూడా సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లు రూమర్స్ ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read: Ravi Teja: మాస్ జాతర నుండి మొదటి గీతం...
Also Read: Dhandoraa: దండోరాలో వేశ్యగా బిందుమాధవి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి