Taarakasura: ‘రావణాసుర’ కాదు.. ఇతను ‘తారకాసుర’
ABN , First Publish Date - 2023-07-11T21:46:47+05:30 IST
కన్నడలో సంచలన విజయం సాధించిన ‘తారకాసుర’ చిత్రం అదే పేరుతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. శ్రీజా మూవీస్ పతాకంపై.. విజయ్ భాస్కర్ రెడ్డి పాళ్యం ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. రవికిరణ్ - మాన్విత హరీష్ జంటగా నటించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ బండియప్ప దర్శకుడు.
ఇటీవల మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా ‘రావణాసుర’ (Ravanasura) అనే టైటిల్‌తో ఓ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాదాపు అలాంటి టైటిల్‌తోనే మరో చిత్రం రాబోతోంది. కన్నడలో సంచలన విజయం సాధించిన ‘తారకాసుర’ (Taarakasura) చిత్రం అదే పేరుతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. శ్రీజా మూవీస్ పతాకంపై.. విజయ్ భాస్కర్ రెడ్డి పాళ్యం ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. రవికిరణ్ - మాన్విత హరీష్ జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు డేని సపని ముఖ్యపాత్ర పోషించారు. ‘పద్మశ్రీ’ ఫేమ్ చక్రవర్తి, తృప్తి శుక్లా సెకండ్ హీరోహీరోయిన్లుగా.. శాంసన్ యోహాన్ విలన్‌గా నటించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ బండియప్ప దర్శకత్వం వహించారు. తాజాగా యూనిట్ ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు మీడియా సమావేశం నిర్వహించింది.
హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హాజరైన వారంతా కన్నడలో ఘన విజయం సాధించిన ఈ ‘తారకాసుర’ చిత్రం తెలుగులోనూ సంచలనం సృష్టించాలని అభిలషించారు. ఈ సందర్భంగా శ్రీజా మూవీస్ అధినేత విజయ్ భాస్కర్ రెడ్డి (Vijay Bhaskar Reddy) మాట్లాడుతూ.. తెలుగులో ‘తారకాసుర’ చిత్రానికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాం. అందుకోసం షూటింగ్ కూడా చేస్తున్నాం. కన్నడలో ఘనవిజయం సాధించిన ఈ సినిమా.. తెలుగు ప్రేక్షకులని కూడా కచ్చితంగా అలరిస్తుంది. మా బ్యానర్ నుంచి త్వరలో ఒక స్ట్రయిట్ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. (Taarakasura Details)
ఇవి కూడా చదవండి:
**************************************
*Dhwani: దర్శకుడిగా 10 ఏళ్ల పిల్లాడు.. అతని టార్గెట్ ఏంటో తెలుసా?
**************************************
*Bholaa Shankar: సెలబ్రేషన్ సాంగ్ వచ్చేసింది.. కీర్తి, తమన్నాలతో చిరు స్టెప్పులు
********************
*Mani Sharma: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ‘మణి’హారం
**************************************
*Thaman S: ట్రోల్స్‌పై సంగీత దర్శకుడు థమన్ ఏమన్నారంటే..
**************************************