Mechanic Rocky: దీపావళికి వ‌స్తోన్న విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'

ABN , Publish Date - Jul 19 , 2024 | 05:34 AM

గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి వంటి హిట్ చిత్రాల త‌ర్వాత మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ న‌టించిన కొత్త చిత్రం మెకానిక్ రాకీ. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ విడుద‌ల తేదీ గురించి మేక‌ర్స్ అప్డేట్ ఇచ్చారు.

Mechanic Rocky: దీపావళికి వ‌స్తోన్న విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'
MechanicRocky

గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి వంటి హిట్ చిత్రాల త‌ర్వాత మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ (Vishwak Sen) న‌టించిన కొత్త చిత్రం మెకానిక్ రాకీ (Mechanic Rocky). మీనాక్షి చౌదరి (Meenakshii Chaudhary) హీరోయిన్‌గా నటిస్తోంది. రవితేజ ముళ్లపూడి (Ravi Teja Mullapudi)ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతుండ‌గా SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ (SRT Entertainments)పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి (Ram Talluri ) భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

తాజాగా ఈ మూవీ గురించిమేక‌ర్స్ అప్డేట్ ఇచ్చారు. మెకానిక్ రాకీ (Mechanic Rocky) చిత్రాన్ని అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. పండుగ వేళ గురువారం రోజున ఈ సినిమా రిలీజ్ కానుండ‌డంతో లాంగ్ వీకెండ్ క‌లిసొచ్చే అవ‌కాశం బాగా ఉంది.


Mechanic Rocky

తాజాగా విడుద‌ల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో విశ్వక్ సేన్ (Vishwak Sen) గన్, రెంచ్‌ను పట్టుకుని బాడ్ యాస్ అవతార్‌లో తన క్యారెక్టర్ ప్రజెంట్ చేస్తూ కనిపించారు. కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ (Jakes Bejoy) సంగీతం అందించారు. మనోజ్ కటసాని డీవోపీ, అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్.

Updated Date - Jul 19 , 2024 | 04:58 PM