Kalki 2898 AD: హైద‌రాబాద్‌లో.. ప్రేక్ష‌కుల మ‌ధ్య ప్ర‌జ‌ల‌ అభిప్రాయం తెలుసుకుంటా

ABN , Publish Date - Jul 10 , 2024 | 09:35 AM

ప్ర‌భాస్, అబమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హ‌స‌న్ వంటి భారీ తారాగ‌ణంతో నాగ్ అశ్విన్ తెకర‌కెక్కించిన భారీ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’.తాజాగా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌ను అమితాబ్ బ‌చ్చ‌న్ ఇంట‌ర్వ్యూ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుద‌లైంది.

kalki

ప్ర‌భాస్ (Prabhas), అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan), క‌మ‌ల్ హ‌స‌న్ వంటి భారీ తారాగ‌ణంతో నాగ్ అశ్విన్ (Nag Ashwin ) తెర‌కెక్కించిన భారీ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) విడుద‌లైన ప్ర‌తి చోటా మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది.

ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.900 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు దాటి దూసుకుపోతున్న ఈ చిత్రం మ‌రో రెండు, మూడు రోజుల్లో వెయ్యి కోట్ల మార్క్‌ను ట‌చ్ చేయ‌నుంది. ఈ క్ర‌మంలో తాజాగా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌ను బిగ్‌ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ ఇంట‌ర్వ్యూ చేయ‌డం చాలా ప్రాధాన్యం సంత‌రించుకుంది.


తాజాగా ఈ కార్య‌క్ర‌మానికి చెందిన ప్రోమోను రిలీజ్ చేయ‌గా అభిమానుల అటెన్ష‌న్‌ను తీసుకుంది. ఈ ప్రోమోలో.. క‌ల్కి (Kalki 2898 AD) సినిమాలో నా న‌ట‌న‌కు వ‌స్తోన్న ప్ర‌శంస‌లు నా న‌ట‌న‌కు వ‌స్తున్నాయ‌ని అనుకోవ‌డం లేద‌ని ఆ అశ్వ‌ధ్ధామ పాత్ర‌కు, సినిమా క‌థ‌కు వ‌స్తున్నాయ‌నుకుంటున్నా అని అన్నారు.

ముఖ్యంగా దీపికా (Deepika Padukone) మంటల్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే స‌న్నివేశం అగ్ని ప్ర‌వేశం నుంచి వ‌చ్చేలా ఉంద‌ని అన్నారు. ఆ సీన్ మూవీకే హైలెట్ అని అన్నారు. హైద‌రాబాద్‌లో తెలుగు ప్రేక్ష‌కుల మ‌ధ్య చిత్రాన్ని చూసి వారిని అడిగి అభిప్రాయాలు తెలుసుకోవాల‌ని ఉంద‌ని అన్నారు.

Updated Date - Jul 10 , 2024 | 09:39 AM