Thaman: తమన్ వన్స్ మోర్.. గుండెలు గెలిచేశాడు

ABN , Publish Date - Nov 25 , 2024 | 05:15 PM

మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మ్యూజిక్‌లోనే కాదు హ్యుమానిటీలోను టాప్ అంటూ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇంతకీ ఆయన ఏం చేశారంటే..

Thaman: తమన్ వన్స్ మోర్.. గుండెలు గెలిచేశాడు

మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ప్రస్తుతం తమన్ వరుస చిత్రాలతో బిజీబిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే ‘పుష్ప 2’లోని ఒక పార్ట్‌కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనుల్ని పూర్తి చేశారు. ‘ఓజీ, ది రాజా సాబ్, గేమ్ చేంజర్, డాకు మహారాజ్’ వంటి చిత్రాలతో తమన్ డైరీ ఫుల్ అయిపోయింది. ఆయన మ్యూజిక్ లోనే కాదు హ్యుమానిటీలోను టాప్ అంటూ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇంతకీ ఆయన ఏం చేశారంటే..


పేదరికంతో బాధపడుతున్న ఒక పేషంట్ కి ఆర్థిక సహాయం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఒక పేషంట్ కిడ్నీ మార్పిడి కోసం రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ విషయాన్ని ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (Asian Institute of Nephrology and Urology) డాక్టర్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే తమన్ ఇలాంటి సహాయం చేయడం మొదటిసారి కాదు.


ఇంతకు ముందు ఆర్టీసీ బస్సులో ఒక అంధుడు 'శ్రీ ఆంజనేయం' సినిమాలోనే ఒక పాటను అద్భుతంగా పాడారు. కాగా ఆ వీడియో వైరల్ అయ్యి సజ్జనార్ దగ్గరికి వెళ్ళింది. ఈ వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. "మ‌నం చూడాలే కానీ.. ఇలాంటి మ‌ట్టిలో మాణిక్యాలు ఎన్నో" అంటూ ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు క‌దా..! ఒక అవ‌కాశం ఇచ్చి చూడండి అంటూ ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణిని ట్యాగ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక ప్రముఖ మీడియా సంస్థ ఆ వికలాంగుని ఇంటర్వ్యూ చేసింది.


ఈ క్రమంలోనే తమన్ ఫ్యాన్స్ ఆ వీడియోని పోస్ట్ చేస్తూ.. తమన్ ని ట్యాగ్ చేశారు. దీనికి తమన్ వెంటనే రెస్పాండ్ అవుతూ.. “అతడు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4లో కచ్చితంగా ప్రదర్శన ఇస్తాడు. ఆహా టీమ్.. ఇదినా రిక్వెస్ట్ అనుకోండి, లేదంటే ఆర్డర్ అనుకోండి. అతడికి అవకాశం కల్పించండి. నేను ఆహా వేదికపై అతడితో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాను. అతడిలో చక్కటి టాలెంట్ ఉంది. పర్ఫెక్ట్ పించింగ్ లో పాడుతున్నాడు. దేవుడు కొన్నిసార్లు కఠినంగా ఉంటాడు. కానీ, మనం మనుషులం. ఆయన మర్చిపోలేని అనుభవాన్ని అందించాలి. అందుకే మేం సిద్ధంగా ఉన్నాం” అంటూ తన దాతృత్వాన్నిచాటుకున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు తమన్ ని ప్రశంశిస్తు కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - Nov 25 , 2024 | 05:16 PM