Robinhood: ‘రాబిన్‌హుడ్’ కష్టమేనా.. క్రిస్మస్

ABN , Publish Date - Dec 11 , 2024 | 05:21 PM

ఇప్పటికే 'పుష్ప 2' విషయంలో కేర్ తీసుకుంటూ ‘రాబిన్‌హుడ్’ ప్రమోషన్స్‌ని మైత్రీ నిర్మాణ సంస్థ సరిగ్గా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి మైత్రీ తీరు నితిన్ అభిమానులను కంగారుకి గురిచేస్తోంది.

Robinhood: ‘రాబిన్‌హుడ్’ కష్టమేనా.. క్రిస్మస్

హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ ఫిల్మ్ ‘రాబిన్‌హుడ్’. ఈ సినిమాని దాదాపు రూ. 70 కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తుంది. ఈ సినిమాని మేకర్స్ మొదట డిసెంబర్ 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. తర్వాత డిసెంబర్ 25కి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ సినిమా మేకర్స్ కి మరోసారి ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏమైందంటే..


ఈ సినిమాని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ 'పుష్ప 2'ని కూడా రూపొందించిన విషయం తెలిసిందే. ఒకవైపు భారీ కలెక్షన్స్ తో ఈ సినిమా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే ఎగ్జిబిటర్స్ నితిన్ ‘రాబిన్‌హుడ్’ రిలీజ్ ని వాయిదా వేయాలని కోరుతున్నారు. దీంతో మేకర్స్ ‘రాబిన్‌హుడ్’ విడుదలను వాయిదా వేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇది సినిమాకే కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.

Nithiin_Robinhood_9fefa0606f_8146e31751.jpg


ఇక మరోవైపు డిసెంబర్ 20, 25 తేదీల మధ్య అరడజను సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రధానంగా ఉపేంద్ర యుఐ, విజయ్ సేతుపతి విడుదల 2, అల్లరి నరేష్ బచ్చల మల్లికి మంచి క్రేజ్ ఉంది. ఇంకోవైపు అప్పటివరకు పుష్ప క్రేజ్ తగ్గే ఛాన్సే లేదు. ఇక జనవరి రెండవ వారంలో భారీ సినిమాలు రిలీజ్ కానుండటంతో నితిన్ ‘రాబిన్‌హుడ్’ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

Updated Date - Dec 11 , 2024 | 05:21 PM