Megastar VS Superstar: చిరంజీవికి పోటీగా రజనీకాంత్.. ఆగస్ట్‌లో అసలు మజా!
ABN , First Publish Date - 2023-05-05T16:29:46+05:30 IST
రజనీకాంత్, చిరంజీవి నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతున్నాయి. వీరిద్దరూ నటించిన చిత్రాలు ఒకేసారి విడుదల కాబోతుండటంతో ఆగస్ట్‌లో ఆసక్తికరపోరు..
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), సూపర్ స్టార్ రజనీకాంత్ (SuperStar Rajinikanth).. బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. వీరిద్దరూ నటించిన చిత్రాలు వరసగా విడుదల కాబోతున్నాయి. దీంతో ఆగస్ట్‌లో వీరిద్దరి మధ్య జరిగే ఆసక్తికర పోటీని వీక్షించేందుకే ప్రేక్షకులు సైతం సిద్ధమవుతున్నారు. ఇటీవల వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భోళాశంకర్’ (Bholaa Shankar) చిత్రంలో నటిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రామబ్రహ్మం సుంకర (Ramabrahmam Sunkara) నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ మార్చిలోనే ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కార్యక్రమాలన్నీ శరవేగంగా జరుగుతున్నాయి.
ఇప్పుడు ఆగస్ట్ లిస్ట్‌లోకి రజనీకాంత్ (Rajinikanth) వచ్చి చేరారు. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్’ (Jailer) చిత్రాన్ని ఆగస్ట్ 10న విడుదల చేయబోతున్నట్లుగా.. సినిమాని నిర్మిస్తోన్న సన్ పిక్చర్స్ (Sun Pictures) సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘జైలర్’ విడుదల తేదీని అఫీషియల్‌గా ప్రకటిస్తూ ఓ వీడియోని కూడా విడుదల చేశారు. అనూహ్యంగా ఈ సినిమా ఆగస్ట్ బరిలోకి.. అందునా మెగాస్టార్ సినిమా కంటే ఒక రోజు ముందుగా విడుదల కాబోతుండటంతో.. ఇప్పుడంతా రజనీ, చిరుల ఫైట్‌ని (Rajinikanth vs Chiranjeevi) వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్‌లో మెగాస్టార్ స్టామినా ఏంటో అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ కూడా చిరు సత్తాని మరోసారి చాటి చెప్పింది. ఈ నేపథ్యంలో ‘భోళాశంకర్’ చిత్రానికి కనుక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం.. తెలుగు రాష్ట్రాల వరకు ఎదురు ఎటువంటి సినిమా ఉన్నా నిలబడటం కష్టమే. అలాగే రజనీకాంత్ విషయానికి వస్తే.. ఆయనకు సరైన సినిమా పడి చాలా కాలం అవుతుంది. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘జైలర్’ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. రజనీ సినిమాకు హిట్ టాక్ వస్తే తప్ప.. తెలుగు ప్రేక్షకులు వీక్షించే పరిస్థితి లేదు. ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా జరగనున్న ఈ ఆసక్తికర పోటీలో ఎవరి సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందనేది చూడాల్సి ఉంది. మరో విశేషం ఏమిటంటే.. చిరంజీవి చేస్తున్న ‘భోళాశంకర్’ చిత్రం తమిళ సినిమా ‘వేదాళం’ (Vedalam)కు రీమేక్.
ఇవి కూడా చదవండి:
************************************************
*Ramabanam Film Review: అన్నదమ్ముల కథన్నారు, కానీ తీరా చూసాక...
*Bhumika Chawla: హీరోల వయసుపై భూమిక కామెంట్స్.. ఏం మారలేదు
*Takkar: చాలా రోజుల తర్వాత.. ఓన్లీ హీరోయిన్‌పైనే సాంగ్
*The Kerala Story: అది కాదు.. ఇది కదా అసలు స్టోరీ.. ఏఆర్ రెహమాన్ కూడా దండం పెట్టేశారు
*Ugram Twitter Review: సినిమా బాగుందంటున్నారు కానీ..
*Rama Banam Twitter Review: ఆ లిస్ట్‌లోకి ఇంకో సినిమా చేరినట్టే..