Varun Tej 14: 1960 నేపథ్యంలో.. మొదలయ్యేది ఆ రోజే!
ABN , First Publish Date - 2023-07-23T18:23:58+05:30 IST
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ 14వ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ‘పలాస’ చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డా.విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారరీ ఎత్తున నిర్మించనున్నారు.
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ 14వ (varun tej 14) చిత్రానికి శ్రీకారం చుట్టారు. ‘పలాస’ చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు కరుణ కుమార్ *(karuna kumar) దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డా.విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారరీ ఎత్తున నిర్మించనున్నారు. ఈ నెల 27న హైదరాబాద్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్‌ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయడానికి పవర్ ఫుల్ స్ర్కిప్ట్‌ని సిద్థం చేశారు దర్శకుడు. దీని కోసం వరుణ్ తేజ్ కంప్లీట్ డిఫరెంట్‌గా మేకోవర్ అవుతున్నారు. వరుణ్‌తేజ్ హీరోగా 1960 నేపథ్యంలో సాగుతుంది. 60ల నాటి వాతావరణం, అనుభూతి కోసం యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేయబోతున్నారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడిస్తారు.