Nani: స్టేజ్ దద్దరిల్లిపోయేలా నాని స్పీచ్..
ABN , Publish Date - Apr 28 , 2025 | 01:33 PM
నేచురల్ స్టార్ నాని (Nani) నోటి నుంచి పవర్ స్టార్ పవన్ డైలాగ్ 9Pawan kalyan) రావడంతో ఆడిటోరియంలోని అభిమానులు ఊగిపోయారు. ఈలలు, కేకలతో స్టేడియం దద్దరిల్లిపోయేలా చేశారు.
నేచురల్ స్టార్ నాని (Nani) నోటి నుంచి పవర్ స్టార్ పవన్ డైలాగ్ 9Pawan kalyan) రావడంతో ఆడిటోరియంలోని అభిమానులు ఊగిపోయారు. ఈలలు, కేకలతో స్టేడియం దద్దరిల్లిపోయేలా చేశారు. ‘హిట్ 3’ ప్రీ రిలీజ్ వేడుకలో ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ (Manalni evadra aapedi) అంటూ పవన్ డైలాగ్ చెప్పి అభిమానుల్లో ఎనర్జీ పెంచారు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్ 3’. మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి దంపతులు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పవర్ స్టార్ పవన్ డైలాగ్‌తో నాని స్పీచ్ ఇరగదీశారు.
‘హిట్ 3’ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నామని, కచ్చితంగా హిట్ అవుతుందని ప్రేక్షకులు, అభిమానులు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కు సినిమా రీచ్ అవుతుందని నాని ధీమా వ్యక్తం చేశారు. ‘నా వెనుక రాజమౌళి గారు ఉన్నారు. నా ముందు అభిమానులు.. మీరున్నారు. మైండ్‌లో హిట్ 3 హిట్ అని ఫిక్స్ అయిపోయాను. మీ అందరి ప్రేమ నాతోనే ఉంది. కడుపులో ఏడుకొండల వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం ఉంది. ఇంకా పవన్‌కల్యాణ్‌గారిలా చెప్పాలంటే..'మనల్ని ఎవడ్రా ఆపేది.’ అంటూ అదరగొట్టారు. దీంతో స్టేడియంలో ఆహుతులు అంతా ఈలలు, కేకలతో మోత మోగించేశారు. ఒక్కసారిగా పవన్‌కల్యాణ్ డైలాగ్ చెప్పేసరికి ఫ్యాన్ ఖుషీ అవుతున్నారు.
కోర్ట్ మూవీ నచ్చకపోతే నా 'హిట్ 3' మూవీ చూడొద్దని చెప్పానని.. ఇప్పుడు 'హిట్ 3' నచ్చకుంటే మహేష్ 'SSMB29'.. చూడొద్దు అంటూ నాని కామెంట్ చేశారు. ఈ సినిమాను తాకట్టు పెట్టినా ఎవరూ పట్టించుకోరని.. ఎందుకంటే.. రాజమౌళి సినిమా అంటేనే ప్రపంచమంతా తప్పకుండా చూడాల్సిందేనని అన్నారు. 'హిట్ 3లో థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు. కానీ వాళ్ల గురించి సక్సెస్ మీట్‌లో మాత్రమే మాట్లాడగలను. కోర్డ్ నచ్చకుంటే హిట్ 3 చూడొద్దని చెప్పాను. నా జడ్జ్‌మెంట్ నిజమైంది. ఇప్పుడు వేరే నిర్మాత కాబట్టి నేను తాకట్టు పెట్టలేను. థియేటర్లను మళ్లీ కళకళలాడించేలా హిట్ 3 ఉంటుంది" అని తెలిపారు.
జక్కన్న పాస్ పోర్ట్ లాక్కుంటా..
నా సినిమా విడుదలైన ఫస్ట్ డే ప్రసాద్ ఐమాక్స్‌లో రాజమౌళి తన కుటుంబంతో కనిపిస్తే నాకు ఆనందం అని నాని అన్నారు. ఆయన ఏ స్క్రీన్‌లో ఉన్నారో కనుక్కొని.. ఆ డోర్ దగ్గరి నుంచొని వాళ్లు సినిమాను ఎలా ఎంజాయ్ చేస్తున్నారో గమనిస్తుంటాను. 'రాజమౌళి మెసేజ్ పెడతా అన్నారంటే ఆ మూవీ హిట్ అయినట్టే లెక్క. ఈ సారి ఎన్ని పనులున్నా ఆయన 'హిట్ 3' చూడాలని కోరుతున్నా. అవసరమైతే అంత వరకూ నేను అయన పాస్ పోర్ట్ లాక్కుంటా. రాజమౌళి ఈ వేడుకకు వచ్చారు కాబట్టి కచ్చితంగా మే 1న బ్లాక్ బస్టర్ కొడుతున్నాం.' అని అన్నారు.