Sreeleela: శ్రీలీల మరో పాపను దత్తత తీసుకుందా..

ABN , Publish Date - Apr 28 , 2025 | 05:33 PM

శ్రీలీల మరో పాపను దత్తత తీసుకుందా..హీరోయిన్‌ శ్రీలీలకు భక్తి ఎక్కువ. అంతకుమించి సేవాగుణం. ఎవరైన ఆపదలో ఉన్నారని తెలిస్తే మూడో కంటికి తెలియకుండా సాయం అందిస్తుంటుంది.

శ్రీలీల (Sreeleela) మరో పాపను దత్తత తీసుకుందా..హీరోయిన్‌ శ్రీలీలకు భక్తి ఎక్కువ. అంతకుమించి సేవాగుణం. ఎవరైన ఆపదలో ఉన్నారని తెలిస్తే మూడో కంటికి తెలియకుండా సాయం అందిస్తుంటుంది. అలా ఆమె చేసిన సేవలెన్నో. వయసులో చిన్నదైనా ఆమెది చాలా పెద్ద మనసని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. అందుకు కారణం లేకపోలేదు. కొన్నాళ్ల క్రితం దివ్యాంగులైన ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకుంటోంది శ్రీలీల. చిన్న వయసులో ఉన్నవారు, అందులోనూ పెళ్లి కానీ అమ్మాయిలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన శ్రీలీల 2022లో ఓ అనాథశ్రమాన్ని సందర్శించింది. దివ్యాంగులైన గురు, శోభిత అనే ఇద్దరు పిల్లల పరిస్థితి చూసి చలించిపోయింది. ఆ ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుంది. ఇంటికి తీసుకొచ్చి ఆ ఇద్దరు పిల్లల మంచి చెడ్డలు చూసుకుంటోంది.

ఇప్పుడు తన ఇంటికి మరో పాప (Another Cute kid) వచ్చినట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె ఒక చిన్నారికి ముద్దు పెడుతూ ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. ‘మా ఇంటికి మరొకరు, మనసును ఆనందంతో నింపేందుకు ఈ చిన్నారి వచ్చింది’ అని పోస్ట్‌ చేసింది. అసలు ఈ పాప ఎవరు? శ్రీలీల మరో పాపను దత్తత తీసుకుందా? లేక తన బంధువుల పాపనా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నెటిజన్ల ప్రశ్న కూడా ఇదే. అయితే చాలామంది శ్రీలీల మరో పాపను దత్తత తీసుకుందని చెబుతున్నారు. అయితే ఈ విషయంపై శ్రీలీల స్పందిస్తే కానీ నిజం ఏంటనేది తెలీదు.  శ్రీలీల జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. గతేడాది ఆమె నటించి నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది కూడా తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో మాస్‌ జాతర, పవన్‌ కల్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సినిమా చేస్తోంది. హిందీలో కార్తీక్‌ ఆర్యన్‌తో కలిసి ఓ సినిమా చేస్తోంది. బాలీవుడ్‌లో ఆమె తొలి సినిమా ఇది.  

Updated Date - Apr 28 , 2025 | 05:39 PM