Manchu Vishnu: ప్రపంచ వ్యాప్తంగా కన్నప్ప మూవ్‌మెంట్..

ABN , Publish Date - Apr 28 , 2025 | 05:57 PM

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ లో జరిగింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ ను విష్ణు యు.ఎస్.లో ప్రారంభించ బోతున్నారు.

హీరో విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీం ప్రాజెక్టుగా 'కన్నప్ప' (Kannappa) సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. 'కన్నప్ప' నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ మూవీ నుండి రిలీజయిన పాటలు పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి. 'కన్నప్ప' చిత్రాన్ని జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు (Mohanbabu) ఈ సినిమా నిర్మించారు. ముఖేష్ కుమార్ సింగ్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో మోహన్ బాబు, మోహన్ లాల్ (Mohan Lal), అక్షయ్ కుమార్ (Akshay Kumar), ప్రభాస్ (Prabhas), శరత్ కుమార్ (Sarath Kumar), కాజల్ (Kajal), మధుబాల (Madhubala) తదితరులు కీలక పాత్రలు పోషించారు.


జూన్ 27 న సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విష్ణు మంచు 'కన్నప్ప' మూవ్‌మెంట్ ని మే 8 నుంచి అమెరికాలో మొదలుపెట్టనున్నారు. గ్రాండ్ గా ఈ సినిమా గ్లోబల్ ప్రమోషన్స్ ని చేయనున్నారు. అమెరికాలోని న్యూ జెర్సీలో కన్నప్ప రోడ్ షోతో మొదలుపెట్టి ఆ తర్వాత డల్లాస్, లాస్ ఏంజిల్స్ లో భారీ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సినిమాలోని ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ వర్కింగ్ విజువల్స్ కొంతమంది సెలెక్టెడ్ ఆడియన్స్ కి చూపించనున్నారు. 'కన్నప్ప' సినిమాని ఇండియాతో పాటు అమెరికాలో కూడా భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు విష్ణు మంచు. విష్ణు మంచు కేవలం 'కన్నప్ప' సినిమా ప్రమోషన్స్ మాత్రమే చేయడం కాకుండా గ్లోబల్ ఆడియన్స్ కి గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు. విశేషం ఏమంటే... 'కన్నప్ప' సినిమా షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ లో జరగ్గా... ఇప్పుడు గ్లోబర్ మూమెంట్ ను మంచు విష్ణు అమెరికా నుండి మొదలెడుతున్నారు.

Also Read: Sreeleela: శ్రీలీల మరో పాపను దత్తత తీసుకుందా...

Also Read: Tollywood: హవీష్‌ తో త్రినాథరావు నక్కిన సినిమా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 28 , 2025 | 05:59 PM