Katha Venuka Katha: కథ వెనుక కథ తెలిసేది ఎప్పుడంటే..
ABN , First Publish Date - 2023-05-08T20:54:41+05:30 IST
విశ్వంత్ దుడ్డుంపూడి (Viswant Duddumpudi), శ్రీజిత గౌష్ (Srijitha Goush), శుభ శ్రీ (Subha Sree) ప్రధాన తారాగణంగా నటించారు. కృష్ణ చైతన్య (Krishna Chaitanya) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని
కొత్త కాన్సెప్ట్ చిత్రాలను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి ప్రారంభమైన దండమూడి బాక్సాఫీస్ (DBO). ఈ బ్యానర్‌పై రూపొందిన తొలి చిత్రం ‘కథ వెనుక కథ’ (Katha Venuka Katha). విశ్వంత్ దుడ్డుంపూడి (Viswanth Duddumpudi), శ్రీజిత గౌష్ (Srijitha Goush), శుభ శ్రీ (Subha Sree) ప్రధాన తారాగణంగా నటించారు. కృష్ణ చైతన్య (Krishna Chaitanya) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అవనీంద్ర కుమార్ (Avanindra Kumar) నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా మే 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా
చిత్ర నిర్మాత అవనీంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాను మే 12న విడుదల చేస్తున్నాం. మా సాయి సినిమాను ముందుండి నడిపించారు. సినిమా చాలా బాగా వచ్చింది. సీట్ ఎడ్జ్ మూమెంట్స్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. సునీల్‌గారు, హీరో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ సహా నటీనటులు, టెక్నీషియన్స్‌కి థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా ప్రేక్షకులని మెప్పిస్తుందనే నమ్మకముందని అన్నారు. (Katha Venuka Katha Ready to Release)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గొట్టిపాటి సాయి (Executive Producer Gottipati Sai) మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలోకి వచ్చి 30 ఏళ్లు అయ్యాయి. 80కిపైగా సినిమాలు చేశాను. మా నిర్మాత అవనీంద్ర కుమార్ జీవితంలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు. ప్యాషన్‌తో అన్ కాంప్రమైజ్డ్‌గా, మంచి కంటెంట్‌తో చేసిన సినిమా ఇది. మే 12న వస్తోన్న ‘కథ వెనుక కథ’ సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరుతున్నానని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*The Kerala Story: మరో స్టేట్‌లో నిషేధం.. షాక్‌లో చిత్రయూనిట్
*Shah Rukh Khan: అద్భుతాలు జరగడానికి సమయం పడుతుంది.. వెయిట్ అండ్ సీ..
*OG: చాలా గ్యాప్ తర్వాత.. పవన్ కల్యాణ్ నుంచి ఊహించని ట్వీట్
*Balagam: ఉత్తమ నటుడు సాయిలు, ఉత్తమ సహనటుడు కొమురయ్య.. మరో ప్రతిష్టాత్మక అవార్డ్
*Bhookailas: ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు ఉదయం 5 గంటలకు షూటింగ్ అని చెప్పిన దర్శకుడు రాకపోవడంతో..?
*Farhana: ఇస్లాంకు వ్యతిరేకం కాదు.. కేరళ స్టోరీ కాంట్రవర్సీతో చిత్రయూనిట్ ముందు జాగ్రత్త చర్యలు