Akhil Akkineni: నాలో చాలా మార్పు వచ్చింది!

ABN , First Publish Date - 2023-04-16T10:51:52+05:30 IST

‘ఏజెంట్‌’ (Agent) సినిమా జర్నీలో ‘నేను చాలా కష్టపెడతాను.. మీరు పడాలి’ అని దర్శకుడు ముందే చెప్పారు. ఈ కథ కోసం ఎంతైనా కష్టపడతానని షూటింగ్‌ ప్రారంభం కావడానికి ముందే చెప్పా.

Akhil Akkineni: నాలో చాలా మార్పు వచ్చింది!

‘ఏజెంట్‌’ (Agent) సినిమా జర్నీలో ‘నేను చాలా కష్టపెడతాను.. మీరు పడాలి’ అని దర్శకుడు ముందే చెప్పారు. ఈ కథ కోసం ఎంతైనా కష్టపడతానని షూటింగ్‌ ప్రారంభం కావడానికి ముందే చెప్పా. దర్శకుడికి ఆ మాటిచ్చే సెట్‌లో అడుగుపెట్టా. అసలు నాలో ఈ లుక్‌ ఊహించలేదు. ఈ ప్రయాణం తర్వాత అలసిపోయా. కానీ ఈ అలసటలో చాలా సంతృప్తి ఉంది’’ అని అఖిల్‌ అక్కినేని (Akkineni Akhil) అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఏజెంట్‌’. స్టైలి్‌ష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి (Surender reddy) దర్శకుడు. సాక్షి వైద్య (sakshi vaidhya) కథానాయిక. మమ్ముటీ (mammoty) కీలక పాత్రలో కనిపిస్తారు. సురేందర్‌ 2 సినిమా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకొస్తోందీ సినిమా. ఈ సందర్భంగా చిత్రబృందం శనివారం రాత్రి హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది.

అఖిల్‌ మాట్లాడుతూ ‘‘జిమ్‌, వ్యాయామాలతో ఎవరి శరీరంలో అయినా మార్పు వస్తుంది. కానీ ఈ సినిమా మానసికంగా ఎంతో మార్పు తీసుకొచ్చింది. చాలా మెంటల్‌గా చాలా బలవంతుడిని అయ్యా. ఈ కథ నా పరిధి దాటి కష్టపడేలా చేసి నా జీవితాన్నే మార్చింది. ఈ రెండేళ్ల ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా కోసం కష్టపెడతాను అని దర్శకుడు ముందే చెప్పారు. ఇప్పుడు అఖిల్‌ చాలా మారిపోయాడు, కొత్తగా కనిపిస్తున్నాడనే మాటలు వినిపిస్తున్నాయంటే ఆయనే కారణం. ఆయన నన్ను ఇలా ఊహించుకుని ఆ దిశగా ప్రోత్సహించారు. మమ్ముట్టిగారి పక్కన నటిస్తూ ఎంతో స్ఫూర్తి పొందాను’’ అని అన్నారు. (Agent on 8 april)

భారతీయ భావోద్వేగాలతో కూడిన స్పై సినిమా ఇది. అఖిల్‌ ఇప్పటిదాకా చేసింది ఒకెత్తు, ఈ సినిమా తర్వాత ఆయన ప్రయాణం మరో ఎత్తు అవుతుందని బలంగా నమ్ముతున్నా. అఖిల్‌ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. రెండేళ్లపాటు ఒకే లుక్‌లో కొనసాగడం అంత ఈజీ కాదు. కానీ ఆ ప్రభావం కనిపించకుండా ప్రయాణం చేశారు. రసూల్‌ ఎల్లోర్‌తో నా మూడో సినిమా ఇది’’ అని దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెలిపారు. ‘‘మేమంతా ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన ఈ చిత్రం వంద శాతం అంచనాల్ని అందుకుంటుంది. ఒక స్టార్‌ని సిద్థం చేస్తున్నామనే ఆలోచనతోనే మేమంతా కష్టపడ్డాం’’ అన్నారు అనిల్‌ సుంకర.

Updated Date - 2023-04-16T10:51:54+05:30 IST