Saripodhaa Sanivaaram: యాక్షన్‌తో మొదలైంది

ABN , First Publish Date - 2023-11-15T01:04:28+05:30 IST

నాని హీరోగా దర్శకుడు వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందుతున్న రెండో చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మంగళవారం...

Saripodhaa Sanivaaram: యాక్షన్‌తో మొదలైంది

నాని హీరోగా దర్శకుడు వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందుతున్న రెండో చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మంగళవారం హైదరాబాద్‌లో మొదలైంది. ఫైట్‌ మాస్టర్‌లు రామ్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలో భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌తో పాటు కొంత టాకీపార్ట్‌ను తెరకెక్కించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ప్రియాంక అరుళ్‌మోహన్‌ ఈ చిత్రంలో కథానాయిక. ఎస్‌జే సూర్య కీలకపాత్ర పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-11-15T10:42:04+05:30 IST