భామతో రాముడి ప్రేమగీతం

ABN , Publish Date - Apr 04 , 2025 | 02:30 AM

సవాల్‌తో కూడిన పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటుణ్ణి తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు సుహాస్‌. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. మాళవికా మనోజ్‌ కథానాయికగా...

సవాల్‌తో కూడిన పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటుణ్ణి తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు సుహాస్‌. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. మాళవికా మనోజ్‌ కథానాయికగా పరిచయమవుతున్నారు. రామ్‌ దర్శకత్వంలో హరీశ్‌ నల్ల నిర్మించారు. నటుడు రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్‌ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. గురువారం చిత్రబృందం టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ‘ఎలాగుండే వాణ్నే ఎలా అయిపోయానే’ అంటూ హీరోయిన్‌ ప్రేమ కోసం హీరో పడే ఇబ్బందులను వివరిస్తూ సాగే ఈ గీతానికి శ్రీహర్ష ఈమని సాహిత్యం అందించారు. రథన్‌ స్వరకల్పనలో శరత్‌ సంతోష్‌ ఆలపించారు. ప్రేక్షక హృదయాలను దోచుకొనే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని నిర్మాత చెప్పారు. సినిమాలోని ఆరుపాటలు ప్రేక్షకులను అలరించేలా ఉంటాయని దర్శకుడు చెప్పారు.

Updated Date - Apr 04 , 2025 | 02:30 AM