Adipurush: ఎవరీ ఓం రౌత్, ఇంతకు ముందు ఎన్ని సినిమాలు చేసాడో తెలిస్తే షాక్ అవుతారు...
ABN , First Publish Date - 2023-06-15T11:08:10+05:30 IST
ఓం రౌత్, ఈ పేరు ఇప్పుడు భారతదేశం అంతటా మారుమోగుతోంది. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత గా చేస్తున్న 'ఆదిపురుష్' సినిమాకి దర్శకుడు. ఎవరితను, ఎక్కడ నుండి వచ్చాడు, ఎన్ని సినిమాలు చేసాడు, ఇంత పెద్ద సినిమాకి దర్శకుడు ఎలా అయ్యాడు ఆ కథా కమామిషు అంతా చదవండి
సినిమాని ఇష్టపడే ప్రతీ ప్రేక్షకుడు గూగుల్ చేస్తున్న పేరు ఓం రౌత్(OmRaut), ఎవరితను ఎక్కడ నుండి వచ్చాడు, అసలు ప్రభాస్ (Prabhas) కి ఎలా పరిచయం అయ్యాడు అని. అందుకని అతని గురించి కొంచెం ప్రేక్షకులకు చెప్పాలని ఈ ఆర్టికల్. ఓం రౌత్ #OmRaut ముంబైలో పుట్టాడు, అతని తల్లి నీనా టెలివిజన్ నిర్మాత అయితే, తండ్రి భరత్ కుమార్ ఒక జర్నలిస్ట్, అలాగే రచయిత, రాజ్యసభ సభ్యుడు కూడాను. మరి ఓం రౌత్ కి ఈ సినిమా ఆసక్తి ఎక్కడ నుంచి వచ్చింది అని అనుకుంటున్నారా? ఓం రౌత్ తాతగారు జె ఎస్ బండేకర్ (JS Badekar) డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేస్తుంటారు, అలాగే ఎడిటర్ గా కూడా పని చేశారు. బహుశా అతని దగ్గర నుండి ఓం రౌత్ కి సినిమాల్లో ఆసక్తి కలిగింది అని చెప్పొచ్చు.
దర్శకుడు కాక ముందు ఓం రౌత్ చైల్డ్ ఆర్టిస్టు గా పని చేసాడు, అలాగే కాలేజీ లో జరిగే నాటకాల పోటీల్లో కూడా పాల్గొనేవాడు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడే కథానాయకుడిగా 'కారమతి కోట్' (Karamati Coat) అనే సినిమా చేసాడు ఓం రౌత్. ఆ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ (IrfanKhan) కూడా ఒక కీ రోల్ చేసాడు. డిగ్రీ అయ్యాక, సిరక్యూస్ విశ్వవిద్యాలయం ( Syracuse University's College of Visual and Performing Arts), న్యూయార్క్ (New York) వెళ్లి అక్కడ ఫిలిమ్స్ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు. ఓం రౌత్ డిగ్రీలో సబ్జెక్టు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు.
చదువు పూర్తి చేసాక ఓం రౌత్ న్యూ యార్క్ లో ఎంటీవీ (MTv) లో పని చేసాడు కొన్నాళ్లపాటు. ఆ తరువాత స్వదేశం వచ్చాడు, ఇక్కడ ఒక ఫిలిం డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ కంపెనీ కి క్రియేటివ్ హెడ్ గా వర్క్ చేసాడు. మొదటి సినిమా ఏ భాషలో చేసాడో తెలుసా ఓం రౌత్, మరాఠీ భాషలో 'లోకమాన్య: ఏక్ యుగ్ పురుష్' (Lokmanya: Ek Yug Purush) అనే సినిమా చేసాడు. ఈ సినిమాకి నిర్మాత ఎవరో తెలుసా, ఓం రౌత్, అతని తల్లి నీనా ఇద్దరూ కలిపి స్థాపించిన నీనా రౌత్ ఫిలిమ్స్. ఇది అందరి ప్రసంశలు అందుకున్న సినిమానే కాకుండా, దీనికి బెస్ట్ దర్శకుడిగా ఫిలిం ఫేర్ అవార్డు (FilmFareAward) కూడా వచ్చింది. మొదటి సినిమాతోనే అందరినీ ఆకర్షించిన వ్యక్తి ఓం రౌత్. ఈ సినిమా 2015 లో తీసాడు.
ఆ తరువాత 2020 సంవత్సరంలో వచ్చిన 'తానాజీ' #Tanhaji అనే సినిమాతో దర్శకుడిగా హిందీలోకి ఆరంగేట్రం చేసాడు. ఇది కూడా ఒక పీరియడ్ సినిమా. అజయ్ దేవగన్ (AjayDevgn), అతని భార్య కాజోల్ (Kajol) ఇందులో లీడ్ పెయిర్ గా నటించారు. టి సిరీస్ (T-Series) సంస్థ నిర్మాణం చేసింది. ఈ సినిమా కూడా చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది ఓం రౌత్ కి. ఇక్కడ నుండే అతనికి, టి సిరీస్ సంస్థ కి మంచి అనుభందం ఏర్పడింది. ఇలా ఒక మరాఠి సినిమా, ఒక హిందీ సినిమా చేసిన ఓం రౌత్ ఇప్పుడు 'ఆదిపురుష్' #Adipurush సినిమా చేస్తున్నాడు.
ప్రభాస్ కి, టి సిరీస్ #T-Series సంస్థతో మంచి అనుబంధం వుంది. సాహో (Saho), రాధే శ్యామ్ (RadheShyam) సినిమాలు చేసినప్పుడు ఆ సంస్థ ప్రభాస్ కి బాగా సహాయం చెయ్యడం ఆ తరువాత ప్రభాస్ వాళ్ళతో ఒక సినిమా చేస్తాను అనటం జరిగింది. అదే సంస్థలో వున్న ఓం రౌత్ అప్పుడు జపాన్ కి చెందిన సినిమా 'రామాయణ: ది లెజెండ్ అఫ్ ప్రిన్స్ రామ' (Ramayana: The Legend of Prince Rama) అనే హిందూ పురాణ కథ ఆధారంగా నిర్మించిన సినిమా నుండి స్ఫూర్తి పొందాడు. ఇది 1992 లో విడుదల అయింది. ఈ సినిమా ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటి ఆధునిక సాంకేతిక వుపయోగించి ఎందుకు రామాయణం తీయకూడదు అనే ఆలోచన వచ్చి అదే విషయాన్ని టి సిరీస్ సంస్థ ప్రతినిదులకు చెప్పడం జరిగింది.
ఆలా అంకురార్పణ జరిగింది ఈ 'ఆదిపురుష్' #AdipurushOnJune16 అనే సినిమాకి. ఇది ఎప్పుడు జరిగింది 2017లో. అప్పుడే ప్రభాస్ ని కలవటం అతనికి ఈ కథ చెప్పటం, ప్రభాస్ ముందు ఈ సినిమా చెయ్యడానికి సందేహించటం, కానీ తరువాత అతన్ని ఒప్పించటం ఇలా చకా చకా జరిగిపోయింది. ముందుగా ప్రభాస్, రాముడుగా వున్న స్టిల్ ఒకటి బయటకి వదిలారు. దానికి భీభత్సమైన రెస్పాన్స్ రావటంతో ఈ రామాయణం కథ ఆధారంగా 'ఆదిపురుష్' #Adipurush సినిమా చెయ్యాలన్న దృఢ నిశ్చయానికి వచ్చారు. ఆలా 'ఆదిపురుష్' సినిమా మొదలై రేపు విడుదల అవుతోంది. అది ఓం రౌత్ కథ. రెండు సినిమాలు చేసినా, ఆ రెండు సినిమాలలో వున్న క్వాలిటీని చూసి ప్రభాస్ అతని ప్రతిభని కనిపెట్టి అతనే ఈ సినిమాని తీయగలడు అని ఒప్పుకున్నాడు. ఇందులో కృతి సనన్ (KritiSanon) సీత మాతగా కనపడుతుంది.