Nbk-Anil ravipudi: టైటిల్ అదేనా?
ABN , First Publish Date - 2022-12-20T17:26:09+05:30 IST
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే!

నందమూరి బాలకృష్ణ (Nbk) కథానాయకుడిగా అనిల్ రావిపూడి(Anil ravipudi) ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే! షైన్ స్ర్కీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ‘పెళ్లి సందD’ ఫేం శ్రీలీల (Srileela)కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం టైటిల్‌కి సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇందులో హీరో బాలకృష్ణ పాత్రను బట్టి అందరూ ‘బ్రో.. బ్రో’ అని పిలుస్తారట. అదే సినిమాకు టైటిల్‌గా పెట్టబోతున్నారని తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని శ్రీలీలను అడగగా, అవుననీ చెప్పలేదు. కాదని చెప్పలేదు. అయితే ఆల్‌మోస్ట్ ఆ టైటిల్ నిజమే అన్నట్లు నవ్వుతూ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. దీంతో అనిల్ ‘బ్రో’ అనే టైటిల్‌ని ఖరారు చేసే అవకాశం ఉందని నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.