Sandhya Theatre Stampede : పుష్ప–2 తొక్కిసలాట.. శ్రీతేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:41 PM
పుష్ప–2 (Pushpa 2) విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
పుష్ప–2 (Pushpa 2) విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ ప్రీమియర్ షో (
(Sandhya Theatre Stampede) సమయంలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ (Sritej Discharged) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అతన్ని రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు.
డిసెంబర్ నెల నాలుగో తేది నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కళ్లు తెరచి చూస్తున్నాడనీ, 15 రోజుల నుంచి లిక్విడ్స్ నోటి ద్వారా తీసుకుంటున్నాడని శ్రీతేజ్ తండ్రి తెలిపారు. ప్రస్తుతం మనుషుల్ని గుర్తు పట్టట్లేదని, అయితే స్టేబుల్‌ఘా ఉన్నాడని తెలిపారు.