Varsha Bollamma: వర్ష బొల్లమ్మ.. షవర్ ముందు ఫోజులతో .. ఫన్నీ వీడియో

ABN , Publish Date - Apr 29 , 2025 | 06:02 PM

జిహ్వ‌కో రుచి.. పుర్రెకో బుద్ది అంటారు.. కొంద‌రిని చూస్తే అదే అనిపిస్తుంది. కొంద‌రు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ‌కు తోచిన ప‌నిచేస్తూ తెగ వైర‌ల్ అయిపోతుంటారు. తాజాగా టాలీవుడ్ బ్యూటీ చేసిన ఓ చిలిపి ప‌ని అలాగే వార్త‌ల్లోకెక్కింది.

సోషల్ మీడియా జోరు పెరిగాక సెలబ్రిటీలు చేసే ప్ర‌తి ప‌ని చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. కొన్ని అనుకోకుండా వైర‌ల్ అయితే.. మ‌రికొంద‌రు తామే తమ సృజనాత్మకతను, ప్రతిభను ప్రదర్శిస్తూ ఫాలోవర్స్‌ను ఆకర్షించే ప్ర‌య‌త్నం చేస్తూంటారు. ఇందుకోసం కొందరు విచిత్ర చేష్టలతో దృష్టిని తమవైపు తిప్పుకోవాలని చూస్తే, కొంతమంది హీరోయిన్లు తమ టైమింగ్, విట్‌తో అందరినీ అలరిస్తారు. అలాంటి వారిలో హీరోయిన్ వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) ముందు ఉంటుంది. ఈ చిన్నదాని పోస్ట్‌లు, క్యాప్షన్‌లు, కామెడీ డైలాగులు నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. తాజాగా మ‌రోసారి ఈ బ్యూటీ పెట్టిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

ఇటీవల వర్ష బొల్లమ్మ వెకేషన్‌లో ఉన్నట్లు కనిపిస్తూ ఒక ఫన్నీ వీడియో షేర్ చేసింది. ఓ పర్యాటక ప్రదేశంలో సింహం నోటి నుంచి నీరు జాలువారే ఫౌంటెన్ దగ్గర, అది తన షవర్ అన్నట్లు ఫన్నీ పోజులతో స్నానం చేస్తున్నట్లు నటించింది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి కామెంట్స్ వెల్లువెత్తాయి. షాంపూ తీసుకోలేదా.., సబ్బు కళ్లలో పడకుండా చూసుకో!, నీవు డైరెక్టర్ అయి కామెడీ సినిమా తీయాలి! అంటూ డిఫ‌రెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ వ‌చ్చాయి. వర్ష ఈ వీడియోకు వర్షవర్ బాతమ్మ అనే క్యాప్షన్ జోడించింది. ఇది చూసి అందరూ నవ్వుల్లో మునిగిపోతున్నారు.

ఇదే కాదు..మొన్నామ‌ధ్య‌ కూడా చిన్న దుస్తుల్లో ఫొటోలు పోస్ట్ చేసి, ప్యాంట్ ఎక్కడా? అడగొద్దు! అంటూ క్రికెటర్ రిషభ్ పంత్‌ను ఫన్నీగా ట్యాగ్ చేసి మరోసారి నవ్వించింది. వర్ష బొల్లమ్మను చూస్తే, ఈ టాలెంట్ అంతా ఎక్కడిది? అని ఆశ్చర్యపోతున్నారంతా. తెలుగులో ‘జాను’ సినిమాతో వర్ష బొల్లమ్మ బాగా పాపులర్ అయింది. ఈ బ్యూటీ... తమిళంలో బిగిల్ తో మంచి గుర్తింపు సంపాదించింది. తెలుగులో మిడిల్ క్లాస్ మెలోడీస్, ఊరిపేరు భైరవకోన వంటి సినిమాలతో తన నటనతో మెప్పించింది. అయితే, ప్రస్తుతం తెలుగులో ఆఫర్లు కొంచెం తగ్గినట్లు కనిపిస్తోంది. ఆమె ఫోకస్ ఎక్కువగా తమిళ ఇండస్ట్రీపై ఉన్నట్లు అనిపిస్తోంది.

Updated Date - Apr 29 , 2025 | 07:49 PM