Balakrishna: ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం..

ABN , Publish Date - Apr 29 , 2025 | 08:35 PM

సరైన సమయంలోనే ఆయనకు పద్మభూషణ్‌ పురస్కారం వరించిందని నందమూరి బాలకృష్ణ అన్నారు.


సరైన సమయంలోనే ఆయనకు పద్మభూషణ్‌ (Padma BHushan)పురస్కారం వరించిందని నందమూరి బాలకృష్ణ (Balakrishna) అన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు.  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. నా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. నాకు ఈ అవార్డు ఎప్పుడో రావాల్సిందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతుంటారు. వారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే.. నాకు సరైన సమయంలోనే పద్మభూషణ్‌ వచ్చింది. నేను నటించిన నాలుగు సినిమాలు వరుసగా సూపర్‌ హిట్‌గా నిలిచాయి. క్యాన్సర్‌ ఆసుపత్రి ప్రారంభించి 15 సంవత్సరాలు అయింది. ముఖ్యంగా నేను సినీ కెరీర్‌ ప్రారంబి?ంచి 50 ఏళ్లు పూర్తయింది. అందుకే ఈ ఏడాది నాకు ఎంతో ప్రత్యేకం’’ అని అన్నారు.

తన తండ్రి నందమూరి తారకరామారావు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తండ్రి అడుగు జాడల్లో ప్రయాణించి నటుడిగా ప్రశంసలు దక్కించుకున్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్‌ ఫిక్షన్‌ అన్ని జానర్లను టచ్‌ చేసిన ఏకైక అగ్ర నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌గా ఎంతోమందికి సాయం అందిస్తున్నారు. 

Updated Date - Apr 29 , 2025 | 08:35 PM