జాకీ చాన్ కు లొకర్నో - లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్
ABN , Publish Date - Apr 29 , 2025 | 07:52 PM
యాక్షన్ స్టార్స్ ను గురించి ముచ్చటించుకోవాలంటే జాకీ చాన్ కు (Jackie Chan) ముందు, తరువాత అని చర్చించుకోవలసి ఉంటుంది. జాకీ చాన్ కు ముందు బ్రూస్ లీ వంటి ఎందరో యాక్షన్ స్టార్స్ మన ఆసియా ప్రతిభను హాలీవుడ్ లో చాటా
యాక్షన్ స్టార్స్ ను గురించి ముచ్చటించుకోవాలంటే జాకీ చాన్ కు (Jackie Chan) ముందు, తరువాత అని చర్చించుకోవలసి ఉంటుంది. జాకీ చాన్ కు ముందు బ్రూస్ లీ వంటి ఎందరో యాక్షన్ స్టార్స్ మన ఆసియా ప్రతిభను హాలీవుడ్ లో చాటారు. అయినప్పటికీ జాకీ చాన్ స్టంట్స్ చూసి హాలీవుడ్ జనం సైతం థ్రిల్లయ్యారు. జాకీతో సినిమాలూ రూపొందించారు. జాకీ చాన్ నటించిన అనేక యాక్షన్ మూవీస్ ఆసియాలోనే కాదు హాలీవుడ్ లోనూ వసూళ్ళ వర్షాలు కురిపించాయి. ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా జాకీకి ఉన్న క్రేజ్ తీరే వేరు. అలాంటి జాకీ చాన్ కు ఆగస్టు 9న 78వ లొకర్నో ఫిలిమ్ ఫెస్టివల్ లో ( Locarno Film Festival) లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ప్రదానం చేయనున్నారు. (lifetime achievement)
"యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్, యాక్షన్ కొరియోగ్రాఫర్, సింగర్, డేర్ డెవిల్ స్టంట్ మేన్, అథ్లెట్... ఇలా జాకీ చాన్ గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు వెలుగు చూస్తాయి. అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలిని గౌరవించడం లొకర్నో ఫిలిమ్ ఫెస్టివల్ కే ఓ కళ" అంటూ ఫెస్టివల్ ఆర్టిస్టిక్ డైరెక్టర్ జియోన ఎ నజ్జరో కీర్తించారు. ఈ లొకర్నో ఫిలిమ్ ఫెస్టివల్ ఆగస్టు 6న ఆరంభమై 16వ తేదీ దాకా సాగనుంది. గత సంవత్సరం మన షారుఖ్ ఖాన్ ను ఇదే పురస్కారంతో 77వ లొకర్నో ఫిలిమ్ ఫెస్టివల్ వేదికగా గౌరవించారు. ఈ సారి జీవితసాఫల్య పురస్కారం అందుకుంటోన్న జాకీ చాన్ వయసు 71 సంవత్సరాలు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలు పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో లాగా ఫాస్ట్ గా స్టంట్స్ చేయకపోయినా తన మార్క్ ప్రదర్శిస్తూ సాగడానికి జాకీ సిద్ధం!