Tom Cruise Dating: టామ్ క్రూయిజ్ తో యానాడి ఆర్మాస్ జూలకటక
ABN , Publish Date - Apr 29 , 2025 | 06:38 PM
'మిషన్ ఇంపాజిబుల్' (Mission impossible) హీరో టామ్ క్రూయిజ్(Tom Cruise) ఆరు పదులు దాటి రెండేళ్ళవుతున్నా, ఇప్పటికీ ప్రేమయాత్రలకు సిద్ధం అంటున్నాడు.
'మిషన్ ఇంపాజిబుల్' (Mission impossible) హీరో టామ్ క్రూయిజ్(Tom Cruise) ఆరు పదులు దాటి రెండేళ్ళవుతున్నా, ఇప్పటికీ ప్రేమయాత్రలకు సిద్ధం అంటున్నాడు. ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు తీసుకున్న టామ్ క్రూయిజ్తా. జాగా క్యూబన్ - స్పానిష్ నటి యానా డి ఆర్మాస్ తో (Ana de Armas) చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నాడని తెలుస్తోంది. వీరిద్దరూ "నీకూ నీ వారు లేరు... నాకూ నా వారు లేరు..." అని పాడుకుంటూ 'ఛల్ మోహనరంగా...' అంటూ షికార్లు చేస్తున్నట్టు సమాచారం. ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇప్పటికే పలుమార్లు క్రూయిజ్, ఆర్మాస్ జోడీ ఫ్యాన్స్ కంట పడింది. ఇటీవల వీరిద్దరూ 'సిన్నర్స్' సినిమా ప్రీమియర్ చూస్తూ ఓ ప్రేక్షకుడు వాష్ రూమ్ పోయి వస్తూ ఉండగా దొరికిపోయారట.
ఆ సినీ ఫ్యాన్ 'అసలు సినిమా అంటే ఇది కదా... ఈ ఇయర్ లో బెస్ట్ మూవీ చూశాను...' అంటూ పోస్ట్ చేశాడు. అతని కామెంట్ 'సిన్నర్స్' గురించి అనుకుంటే పొరబాటే! టామ్- యానా ప్రేమయాత్ర ఇంకెలా సాగుతోందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇంతకు ముందు మ్యాడ్రిడ్ నుండి లండన్ కు వస్తూ ఒకే హెలికాప్టర్ నుండి దిగుతున్న టామ్ - యానా కెమెరా కళ్ళకు చిక్కారు. ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే సందర్భంలోనూ ఈ జంట కలుసుకుంది. అయితే వారి ఏజెంట్స్ టామ్ - యానా మధ్య బంధాన్ని శంకించరాదు- వారిది 'ప్లేటోనిక్ లవ్' అంటూ కీర్తించారు. తరువాత లండన్ లోని లెయిసెస్టర్ స్క్వేర్ లోనూ కనిపించారు. వారిద్దరూ తాము కలసి నటించబోయే సినిమాల గురించి చర్చించుకుంటున్నారని వారి సన్నిహితులు చెబుతున్నారు. ఆ చర్చ ఎటు దారితీస్తుందో చూడాలి.