Dhanraj interview: నవరసాల్లో నవ్వించటమే కష్టం
ABN , First Publish Date - 2022-09-11T05:40:51+05:30 IST
ధనరాజ్ అంటే తెలియని తెలుగువాళ్లు ఉండరేమో అంటే అతిశయోక్తి కాదు. అతను టీవీల్లో ఎన్నో షోస్‌లు చేసి తెలుగువాళ్లకి సుపరిచితమయ్యాడు. సినిమాల్లో హాస్యనటుడిగా ప్రత్యేస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

ధనరాజ్ (Dhanaraj)అంటే తెలియని తెలుగువాళ్లు ఉండరేమో అంటే అతిశయోక్తి కాదు. అతను టీవీల్లో ఎన్నో షోస్‌లు చేసి తెలుగువాళ్లకి సుపరిచితమయ్యాడు. సినిమాల్లో హాస్యనటుడిగా ప్రత్యేస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ధనరాజ్ అటే కామెడీ పాత్రలే అనుకుంటే పొరపాటు. తాను కామెడీ పాత్రలే కాదు.. ఛాన్స్ ఇస్తే ఎలాంటి పాత్రనైనా పోషించగలను అని చెబుతున్నాడు. ఆలా చేసిన సినిమానే ‘బుజ్జి ఇలా రా’. ఇందులో సీఐ కేశవనాయుడుగా ధనరాజ్ మెప్పించిన తీరు అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకులు ప్రశంసలతో ముంచెత్తారు. కమెడీయన్ ధనరాజేనా ఈ పాత్ర చేసింది అనేలా నటించాడు. తెలుగులోనే కాకుండా హిందీలోనూ ఓ ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నాడు ధనరాజ్. హిందీలో మూకీ సినిమా కూడా చేస్తున్న ధనరాజ్‌తో ‘చిత్రజ్యోతి’తో ప్రత్యేక ఇంటర్వ్యూ...(Dhanaraj interview)
ధనరాజ్ పోలీస్ గెటప్ వేయడం ఏంటి? నమ్మశక్యంగా ఉందా?
లాక్ డౌన్ సమయంలో సాయంత్రం ఆరు తర్వాత బయటకి రాకూడదు అన్నారు కదా. ఆ సమయంలో దర్శకుడు నాగేశ్వరరెడ్డి ఓ ఆడియో మెసేజ్ ఇచ్చారు. అది ఓ కథ నేరేషన్. నాకు బాగా నచ్చింది. తర్వాతి రోజు ఆయన్ను కలిసి అందులో సి.ఐ కేశవ నాయుడు కేరక్టర్ బావుంది ఎవరు వేస్తున్నారు అనడిగాను. ‘నువ్వే వేస్తున్నావు’ అన్నారు. నేను ఆ మట నమ్మలేదు, నిర్మాతలు కూడా అదే చెప్పారు. ఆ పాత్ర కోసం 15 కేజీల బరువు పెరిగాను.
ఈ పాత్ర కోసం ఎలాంటి హోమ్ వర్క్ చేశారు? వేరే సినిమాలు ఏమైనా వదులుకున్నారా?
చాలా వదులుకున్నా. కొందరు పోలీస్ మిత్రులను కలిసి వాళ్ళు ఎలా వుంటారో కనుక్కున్నా. పోలీస్‌కు సంబంధించిన ప్రతి డీటెయిలింగ్ తెలుసుకున్నా. దానికి తోడు మా నిర్మాతల్లో ఒకరు పదవీ విరమణ చేసిన పోలీస్ కానిేస్టబుల్, అందువల్ల నా పని ఇంకా తేలిక అయింది. మన హీరోలు చాలామంది పోలీస్ పాత్రలు వేశారు. వాళ్లని స్ఫూర్తిగా తీసుకున్నా.
ఈ పాత్రను మీకు ఇవ్వడానికి కారణమేంటో దర్శకుణ్ణి అడిగారా?
నాకు కూడా డౌట్ వచ్చి అతన్నే అడిగా. నీలో ఒక సైకోని చూసా అన్నారు. ఏమో ఎప్పుడు ఎలా నన్ను అలా చూశారో తెలియదు.
ఒక సీరియస్ రోల్ చేశారు కదా, మరి కామెడీ పాత్రలు తగ్గిస్తారా?
లేదు. కామెడీ చేస్తూనే ఇలాంటి మంచి కేరక్టర్స్ వచ్చినప్పుడు చేస్తా.
ఇంతకుముందు ఇలాగే కొందరు కమెడియన్స్ మెయిన్ లీడ్ చేసి అటుఇటూ కాకుండా అయ్యారు. మీ సంగతి ఏంటి?
ఈ కథ తర్వాత నన్ను లీడ్‌గా చేయమని చాలామంది కథలు పట్టుకొని వచ్చారు. నేను అంగీకరించలేదు. ‘బుజ్జి ఇలా రా’ సినిమా చూశాక నన్ను పెట్టి సినిమా తీేసద్దాం అనుకుంటున్నారు. అందుకే అంగికరించలేదు. నా కోసం కథ రాసి ఆ పాత్రకు నేను సరిపోతానని అని నమ్మకం కలిగి అది నాకు నచ్చితే అప్పుడు ఆలోచిస్తా. ఆలా కాకుండా ధనరాజ్ కోసం కథ రాసుకొని వేస్త మాత్రం చెయ్యను.
సీరియస్ రోల్స్ చెయ్యటం ఈజీ నా, లేక కామెడీ నా?
జవాబు: నవ రసాల్లో నవ్వించటమే కష్టం. ఎందుకంటే ఒక వ్యక్తిని ఏడిపించాలి అన్న, కోపం తెప్పించాలి అన్న చాలా ఈజీ. కానీ అదే వ్యక్తిని నవ్వించాలి అంటే కష్టం. అందుకే కామెడీ చేసినవాడు ఏ పాత్ర అయినా చేస్తాడు అన్నారు వెనకటికి ఒకరు.
ఈ సినిమాలో సునీల్ కూడా వున్నాడు కదా, మరి మీరిద్దరూ ఉండటంతో కామెడీ సినిమా అనుకోరా?
జవాబు: ట్రెలర్ విడుదల అయ్యాక ప్రేక్షకులకి ఒక అవగాహనా వచ్చింది ఈ సినిమా కొంచెం భిన్నమైందని ఈ సినిమాకి ఎన్ని డబ్బులు వచ్చాయి అన్నది పక్కన పెడితే, నాకు ఈ సినిమా చేసినందుకు ఒక గౌరవం ఏర్పడింది విశ్లేషకులు చూసిన ప్రేక్షకులు ఈ సినిమాని నా పాత్రను ఎంతగానో మెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా వేరే మాధ్యమంలో విడుదలవుతుంది. అప్పుడు చాలామంది చూేస అవకాశం వుంది.
తమిళ్ నటుడు, కమెడియన్ సూరి మీరు ఒకే పోలికలో వుంటారు, మీకు తెలుసా?
తెలుసు. ఆ మధ్య మా ఇద్దరి ఫొటొలు వైరల్ అయ్యాయి. ఒక మీమ్ కూడా వైరల్ అయింది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటి అంటే, భీమిలి కబడ్డీ జట్టు అనే సినిమా ఒక తమిళ్ సినిమాకి రీమేక్. అందులో సూరి వేసిన పాత్రను నేనే తెలుగులో చేశా. మేమిద్దరం ఒక తమిళ్ సినిమాలో కలిసి పని చేశాం. అప్పుడు మాట్లాడుకున్నాం ఇద్దరం చాలాేసపు. అతను మంచి వ్యక్తి. ఇంకో విషయం ఏంటి అంటే, అతని తమిళ్ సినిమాలు తెలుగులో అనువాదమైతే అతని పాత్రకు నేనే డబ్బింగ్ చెబుతా.
మీకు తమిళ్ వచ్చా?
జవాబు: ఇప్పుడు వచ్చు. మొదట్లో నాకు తమిళ్ రాదు. జి వి నారాయణరావు గారు అని సీనియర్ ఆర్టిస్ట్ వున్నారు కదా. అతని దగ్గరికి ఒకసారి టి విజయన్ గారు వచ్చి ఒక ఆర్ట్ సినిమా చేద్దాం అన్నారు. ఆ సినిమా కోసం, సన్నగా, బక్కగా వుండే అతను కావాలి అంటే, నారాయణరావు గారు నన్ను పిలిచారు. విజయన్ గారు నీకు తమిళ్ వాచా అని అడిగారు, రాదని చెప్పా. సరే సినిమా మొదలవ్వటానికి ఆరు నెలలు పడుతుంది కదా, అంతవరకు నా దగ్గర వుంది అని చెప్పారు. అతని ఇంట్లో వున్నా, అతనే వండి పెట్టేవారు. ఆలా అతని దగ్గర తమిళ్ నేర్చుకున్న. కానీ అప్పుడే మా అమ్మకి కేన్సర్ వుంది అని తెలిసి నేను మా ఊరి వెళ్లాల్సి వచ్చింది, ఆ సినిమా మిస్ అయింది.
మీ రాబోయే సినిమాలు ఏంటి?
సముద్రఖని హీరోగా ఒక సినిమా వస్తోంది, అందులో నేను ఒక మంచి రోల్ చేస్తున్న. ఈ సినిమాకి జాతీయ అవార్డు వస్తుంది అని నేను అనుకుంటున్నా. ఇవి కాకుండా ఇంకా ఒక అయిదారు సినిమాలు చేస్తున్న. అవన్నీ కామెడీ రోల్స్.
హిందీ సినిమాలు చేసే ఆలోచన ఉందా?
నేను ఏ భాషల్లో అవకాశం వచ్చినా చేస్తాను. హిందీ సినిమాలో నేను ఇప్పటికే నటించాను కూడా. మన తెలుగు సినిమా భాగమతి హిందీలో తీశారు. అక్కడ కూడా అశోక్ దర్శకుడు. భూమి పెడ్నేకర్ అనుష్క పాత్ర చేశారు. తెలుగులోఒ నేను చేసిన పాత్రను హిందీలోనూ చేశాను. లవ్ రంజన్ అని హిందీ లో బాగా పాపులర్ దర్శకుడు, నిర్మాత. అతను ఒక భిన్నమైన సినిమా చేశారు. అదే మూకీ సినిమా. మొదటి సారిగా నేను మూకీ సినిమాలో నటించటం. అవి లేకుండా నవ్వించటం అంటే ఎంత కష్టం. అది ఒక చాలెంజింగ్ రోల్, బత్వరలో విడుదలవుతుంది కూడా. ఎందుకంటే మూకీ సినిమా కదా. ఈ సినిమా ఒక ప్రయోగం లాంటిది.
మీ కుటుంబం గురించి చెప్పండి?
నాకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పెద్దవాడు 10వ తరగతి చదువుతున్నాడు. రెండోవాడికి నాలుగేళ్లు. నాకు నా భార్యే పెద్ద క్రిటిక్. నా సినిమా బాగోకపోతే వెంటనే చెప్పేస్తుంది. మా ఆయన స్కిట్ బాగోలేదు అని పక్కింటి వాళ్ళకి చెప్పి చూడొద్దు అంటుంది. అలాంటిది ఈ ‘బుజ్జి ఇలా రా’ సినిమా చూశాక నన్ను హగ్ చేసుకుంది. ఇంకా నేను చేేస ఖర్చులన్నీ మా ఆవిడకి చెప్తాను. అందుకే నా డెబిట్ కార్డు మా ఆవిడా దగ్గర, ఆమె కార్డు నా దగ్గర వుంది ఖర్చు చేస్తాం.
మళ్ళీ నిర్మాతగా కానీ, దర్శకత్వం కానీ చేస్తారా?
ఇప్పట్లో అయితే లేదు. నిర్మాతగా ఓ సినిమాతో చాలా డబ్బులు పోగొట్టుకున్నా. సినిమా సినిమాకి, వయసుతో పాటు కొంచెం అవగాహన పెరుగుతూ వస్తుంది, ఆలోచన దృక్పథం, కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవటం, ఇలాంటివి వస్తాయి. అందుకని ఆ రెండూ ఇప్పట్లో లేనట్టే.
బిగ్‌బాస్ చూస్తున్నారా? చాలామంది విమర్శలు కూడా చేస్తున్నారు, బిగ్ బాస్ చెత్త అని, వేస్ట్ అని, ఇంకొకరు జంతువలను పెట్టినట్టు మనుషులను అందులో పడేశారని కూడా అన్నారు. మీకెలా అనిపించింది?
అవన్నీ వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు. వాటిని మనం గౌరవించాలి. నాకు మాత్రం బిగ్ బాస్ వల్ల చాలా నేర్చుకున్నా. ప్రత్యేకంగా కుటుంబం మీద గౌరవం ఏర్పడింది. విలువ తెలిసింది. ఎందుకంటే బిగ్ బాస్ ఇంట్లో ఎవరి బట్టలు వారే, ఎవరి పనులు వారే చేసుకోవాలి. అప్పుడు అర్థం అయింది, మా అమ్మ, మా ఆవిడా ఎంత చేస్తున్నారో అన్న విషయం. ఆ విషయం నేను చాలా మారాను, అందరూ ఎదో ఒకటి నేర్చుకొని బయటకి వస్తారనుకుంటున్నా.
బిగ్‌బాస్ ఇంట్లో ఒకరి మీద ఒకరు ఆరోపణలు, కోపాలు, ఇష్టపడటాలు ఉంటాయి కదా. ఈ కోపం అనేది ఇంట్లోంచి బయటకి వచ్చాక కూడా అలాగే ఉంటుందా?
ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఇంట్లో వున్న ఆ 15 మంది తోనే ఏమి మాట్లాడాలన్నా, గొడవ పడాలన్నా కూడా. అందువల్ల బయటకి వచ్చాక అవి కేరీ చేస్తారు. చాలామంది. బయటికి వచ్చాక కూడా మాట్లాడుకోరు, అలాగే ేస్నహం కూడా కొనసాగిస్తారు. నాకు అయితే ఎవరితో కూడా వ్యతిరేకం లేదు, అందరితో ేస్నహంగానే వున్నాను. మేము ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని, అందులో మాట్లాడుకుంటాం.