Prashanth: హెల్మెట్‌ ధరించాల‌ని ప్ర‌చారం చేశా.. చివ‌ర‌కు నేనే ఫైన్ క‌ట్టా

ABN , Publish Date - Aug 06 , 2024 | 03:41 PM

ప్రశాంత్ , ప్రియా ఆనంద్ జంటగా నటించిన చిత్రం ‘అంధగన్’. చాలా కాలం షూటింగ్ జ‌రుపుకున్న‌ ఈ మూవీ ఆగస్టు 9న ప్రేఓకుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా మూవీ టీం మీడియాతో మాట్లాడింది.

PRASANTH

ప్రకృత్రి ప్రకోపానికి గురైన వయనాడ్‌ బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని హీరో ప్రశాంత్ (Prashanth) పిలుపునిచ్చారు. ప్రశాంత్‌ హీరోగా నటించిన ‘అంధగన్‌’ (Andhagan) చిత్రం ఈనెల 9న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా, కోయంబత్తూరులో ఆయన హీరోయిన్‌ ప్రియా ఆనంద్ (Priya Anand), నటి సిమ్రాన్ (Simran)తో కలిసి మీడియాతో మాట్లాడారు.

‘వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడడంతో ఆప్తులను, ఆస్తులను కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు, సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదిక చేపట్టేందుకు అందరూ ముందుకు రావాలి. ‘అంధగన్‌’ రీమేక్‌ కాదని, రీమేడ్‌ అన్నారు. 110 శాతం తమిళంలో చూసిన అనుభూతి కలుగుతుందని అన్నారు. ఈనెల 9న దాదాపు 400 స్క్రీన్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామ‌న్నారు.


1prashant.jpg

ఇక యేడాదిగా హెల్మెట్‌ ధరించండి అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాన‌ని, అలాంటిది ఈ మ‌ధ్య అనుకోకుండా హెల్మెట్ లేకుండా బైక్ న‌డిపినందుకు ట్రాఫిక్‌ పోలీసులు నాకూ ఫైన్‌ వేశారన్నారు. హెల్మెట్‌ ధరించాలన్న నా అవగాహన కార్యక్రమానికి ఈ ఘ‌ట‌న‌తో మంచి ప్రచారం లభించినట్టైంది’ అని హీరో ప్రశాంత్ (Prashanth) పేర్కొన్నారు.

Updated Date - Aug 06 , 2024 | 03:41 PM