మైత్రీ సంస్థ ద్విభాషా చిత్రం
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:40 AM
‘లవ్ టుడే, డ్రాగన్’ చిత్రాలతో కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ప్రదీప్ రంగనాథన్. ఇప్పుడు ఆయనతో ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు, తమిళ భాషల్లో...

‘లవ్ టుడే, డ్రాగన్’ చిత్రాలతో కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ప్రదీప్ రంగనాథన్. ఇప్పుడు ఆయనతో ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘ప్రేమలు’ చిత్రంతో యువతను మెప్పించిన మమితాబైజు ప్రదీప్‌కు జోడీగా నటిస్తున్నారు. కీర్తిశ్వరన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బుధవారం పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ ప్రారంభించారు. శరత్‌కుమార్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, ఎడిటర్: భరత్ విక్రమన్.