Sardar2: కార్తీ ‘సర్దార్‌’ 2 రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం

ABN , Publish Date - Jul 16 , 2024 | 09:02 PM

కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్‌’ చిత్రానికి రెండో భాగం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభ‌మైంది. ఈ చిత్రం పూజా కార్యక్రమం సోమవారం చెన్నైలో ఘ‌నంగా జరిగింది.

sardar 2

కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్‌’ ( Sardar2)చిత్రానికి రెండో భాగం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభ‌మైంది. ఈ చిత్రం పూజా కార్యక్రమం సోమవారం చెన్నైలో ఘ‌నంగా జరిగింది.

GSQsRRrWYAANb0l.jpeg

2022లో ‘సర్దార్‌’ తొలి భాగం విడుద‌ల‌యింది. కార్తీ ద్విపాత్రాభినయం పోషించిన ఈ చిత్రం సూపర్ డూపర్‌ హిట్‌ సాధించింది.

GSQsRK_aYAAH_VX.jpeg

రూ.100 కోట్ల మేరకు వసూళ్ళను రాబట్టింది. మిత్ర‌న్ (PS Mithran ) ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా ఎస్జే సూర్య (S J Suryah) కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.


GSQsROOXoAAC1FW.jpeg

ఈ నేపథ్యంలో రెండో భాగాన్ని ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత లక్ష్మణ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. తొలి భాగంలో నటించిన నటీనటులే రెండో భాగంలోనూ నటించనున్నారు. అయితే, తొలి భాగానికి జీవీ ప్రకాష్‌ సంగీతం సమకూర్చగా, రెండో భాగానికి మాత్రం యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించనున్నారు. మిగిలిన వివరాలను తర్వాత వెల్లడించనున్నారు.

Updated Date - Jul 16 , 2024 | 09:02 PM