Vijay Antony: నాకు ప్రతి తెలుగు సినిమా ఇష్టమే..

ABN, Publish Date - Jul 27 , 2024 | 10:08 PM

హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తుఫాన్’. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. పొయెటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జానర్‌లో దర్శకుడు విజయ్ మిల్టన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్ట్ 2న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు.

Toofan Pre Release Event

హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తుఫాన్’ (Toofan). ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ (Vijay Antony) హీరోగా ‘రాఘవన్, హత్య’ వంటి సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జానర్‌లో దర్శకుడు విజయ్ మిల్టన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్ట్ 2న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. (Vijay Antony Speech at Toofan Pre Release Event)

Also Read- K Vijaya Bhaskar: మరో ‘నువ్వు నాకు నచ్చావ్’ లాంటి సినిమా ఇది..

ఈ కార్యక్రమంలో హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. ‘తుఫాన్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన సత్యరాజ్‌కు, కరుణాకరన్‌కు థ్యాంక్స్. సత్యరాజ్ ఈ సినిమాలో ఓ మంచి రోల్ చేశారు. ఆయన ఈ మూవీలో భాగమవకుంటే ఇది అసంపూర్తి అయ్యేది. డైరెక్టర్ విజయ్ మిల్టన్ ఈ సినిమా కోసం మంచి స్క్రిప్ట్ సిద్ధం చేశారు. నా రైట్ హ్యాండ్ లాంటి పర్సన్ డైలాగ్ రైటర్ భాష్యశ్రీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ భారీ సినిమా చేయడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అయినా కంటెంట్ మీద నమ్మకంతో మా ప్రొడ్యూసర్స్ కమల్, ప్రదీప్, ధనుంజయన్ ఈ సినిమా చేశారు. ఈ మూవీని బాగా ప్రమోట్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. వాళ్లు ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాను.


ఈ మూవీలోని క్వాలిటీ, కంటెంట్ తప్పకుండా సక్సెస్ ఇస్తాయని నమ్ముతున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి తన బీజీఎంతో మా మూవీని మరింత ఎఫెక్టివ్‌గా మార్చారు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్‌లో ఆయన మ్యూజిక్ సర్‌ప్రైజ్ చేస్తుంది. ఫ్యూచర్‌లోనూ ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. త్వరలో ఈ సినిమా స్నీక్ పీక్ రిలీజ్ చేస్తాం. అది మూవీపై ఇంకా ఆసక్తిని పెంచుతుంది. ‘బాహుబలి’ (Bahubali) తర్వాత తెలుగు సినిమాల రేంజ్ పెరిగింది. నాకు ప్రతి తెలుగు సినిమా ఇష్టమే. హైదరాబాద్‌తో, తెలుగు ఆడియెన్స్‌తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతానని ఆశిస్తున్నాను’’ అన్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 27 , 2024 | 10:08 PM