Toofan: 'ఇతడెవరు.. ఇతడెవరు'.. విజయ్ ఆంటోనీ తుఫాన్ నుంచి లిరికల్ సాంగ్

ABN , Publish Date - Jul 17 , 2024 | 07:29 PM

విజయ్ ఆంటోనీ నటించిన‌ కొత్త మూవీ తుఫాన్. ఈ సినిమా ఆగస్టు 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి 'ఇతడెవరు' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

Toofan

రోమియో వటి సూపర్ హిట్ చిత్రం తర్వాత హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) నటిస్తున్న కొత్త మూవీ తుఫాన్ (Toofan). ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ (Vijay Antony) హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. ఇప్పుడు పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో దర్శకుడు విజయ్ మిల్టన్ (Vijay Milton) ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుండి 'ఇతడెవరు' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట‌ను అచ్చు రాజ‌మ‌ణి (Achu Rajamani), విజయ్ ఆంటోనీ (Vijay Antony) బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా భాష్యశ్రీ (Bhashya Shri) గుర్తుండిపోయే సాహిత్యాన్ని అందించారు. సంతోష్ హరిహరన్ ఆకట్టుకునేలా పాడారు. 'ఇతడెవరు ఇతడెవరు తెలియని ఓ చరితో, లోతైన ఓ కడలో.. తను గాథో ఎద బాధో..తను ఉరుమో లేక పిడుగో..' అంటూ కథానాయకుడి ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో పవర్ ఫుల్ గా సాగుతుందీ పాట.

GSsPR-4WQAAVZ1o.jpeg


శ‌ర‌త్ కుమార్ (Sarath Kumar), స‌త్య‌రాజ్ (Sathyaraj), దాలి ధ‌నుంజ‌య (Daali Dhanunjaya), ముర‌ళీ శ‌ర్మ (Murali Sharma) వంటి ఆగ్ర న‌టులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోండ‌గా మేఘా అకాశ్ (Megha Akash) క‌థానాయిక‌గా చేస్తోంది. ఆగస్టు 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు.

Updated Date - Jul 17 , 2024 | 07:29 PM