Toofan Trailer: ఎవరి గతంలో లేని, మరొకరి భవితగా మారిన ఓ వ్యక్తి కథ..

ABN , Publish Date - Jun 29 , 2024 | 09:23 PM

హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తుఫాన్’. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్‌లో దర్శకుడు విజయ్ మిల్టన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జూలైలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Toofan Trailer: ఎవరి గతంలో లేని, మరొకరి భవితగా మారిన ఓ వ్యక్తి కథ..
Vijay Antony in Toofan

ఎప్పుడూ విభిన్నమైన సినిమాలు చేస్తూ.. హీరోగా తనకంటూ ఓ క్రేజ్‌ని సొంతం చేసుకున్న విజయ్ ఆంటోనీ (Vijay Antony) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తుఫాన్’ (Toofan). ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా ‘రాఘవన్, హత్య’ సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జానర్‌లో దర్శకుడు విజయ్ మిల్టన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జూలైలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను శనివారం మేకర్స్ విడుదల చేశారు.


Toofan-Movie.jpg

ట్రైలర్ విషయానికి వస్తే (Toofan Trailer Talk).. ‘తుఫాన్’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఎవరి గతంలో లేని, మరొకరి భవితగా మారిన ఓ వ్యక్తి కథ ఇదనేది ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. తనకు ఎవరూ తెలియని ఓ ప్రాంతంలోకి వెళ్లి ఎవరూ తనను గుర్తుపట్టకుండా జాగ్రత్తపడుతుంటాడు హీరో విజయ్ ఆంటోనీ. అతన్ని తన చీఫ్ శరత్ కుమార్ గైడ్ చేస్తుంటాడు. హీరోను ఓ కుటుంబం ఆదరిస్తుంది. మరోవైపు పోలీస్ అధికారి మురళీ శర్మ... హీరో కోసం వేట సాగిస్తుంటాడు. ఇంతకీ ఎవరి గతంలో లేని హీరో గతమేంటి? అతని కోసం పోలీసు వేట ఎందుకు సాగుతోంది? కొత్త ప్రాంతంలో తనను ఆదరించిన కుటుంబం కోసం హీరో ఏం చేశాడు? అనేది ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. సినిమాటోగ్రఫీ, బ్యూటిఫుల్ లొకేషన్స్, పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సులు, విజయ్ ఆంటోనీ ఇంటెన్స్, ఎమోషనల్ పెర్ఫార్మెన్మ్ ఈ సినిమాకు హైలెట్ అనేలా ఈ ట్రైలర్ తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Read Latest Cinema News

Updated Date - Jun 29 , 2024 | 09:23 PM