Toofan First Single: వెతికా నేనే నా జాడే! 

ABN , Publish Date - Jun 21 , 2024 | 07:22 PM

హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా చిత్రం  'తుఫాన్'. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు.

Toofan First Single: వెతికా నేనే నా జాడే! 

తమిళ నటుడు, సంగీత దర్శకుడు  విజయ్ ఆంటోనీ (Vijay Antony) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం  'తుఫాన్' (Toofan). ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్ లో  ఈ చిత్రం తెరకెక్కింది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు

శుక్రవారం ఈ చిత్రం సెకండ్ సింగిల్ 'వెతికా నేనే నా జాడే' రిలీజ్ చేశారు. ఈ పాటకు భాష్యశ్రీ లిరిక్స్ అందించారు. మాష్మి నేహా పాడారు. హరి దఫూషియా సంగీతాన్ని అందించారు. ' వెతికా నేనే నా జాడే నిలిచి దారిలో..నా ఒళ్లే వెతికే నేడు కొత్త పేరునే, నాకు నేనై తప్పి పోయా గాలై సాగుతూ.. కాలం కరిగిపోయే తీరం చేరుతూ' అంటూ ఆలోచింపజేసే లిరిక్స్ తో సాగుతుందీ పాట.  విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకుడు. 

Updated Date - Jun 21 , 2024 | 07:38 PM