Prabhas: రూ. 1000 కోట్లు.. మరోసారి సత్తా చాటిన రెబల్ స్టార్

ABN , Publish Date - Jul 13 , 2024 | 10:09 PM

రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన ‘కల్కి 2898 AD’ మూడవ వారంలోకి ఎంటరై బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మైలురాయిని చేరుకుని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్‌కు ఇప్పుడు రూ.1000 కోట్ల గ్లోబల్ క్లబ్‌లో రెండు సినిమాలు ఉన్నాయి.

Kalki 2898 AD Movie Still

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నటించిన ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) మూడవ వారంలోకి ఎంటరై బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మైలురాయిని చేరుకుని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ‘బాహుబలి 2’ (Bahubali 2) తర్వాత ప్రభాస్‌కు ఇప్పుడు రూ.1000 కోట్ల గ్లోబల్ క్లబ్‌లో రెండు సినిమాలు ఉన్నాయి. ‘కల్కి 2898 AD’ సౌత్ ఇండియన్ సినిమాలలో నాన్-బాహుబలి 2 రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించగా.. హిందీ బెల్ట్, ఇతర భాషలలో కూడా ఘన విజయాన్ని అందుకుంది.

Also Read- Tollywood Hero: ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా? టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరో?

ఈ చిత్రం నార్త్ అమెరికాలో $17 మిలియన్ల మార్కును దాటింది, ఇది ఇప్పటికే ఈ ప్రాంతంలో నాన్-బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టింది. ‘కల్కి 2898 AD’ యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, కెనడా, కొన్ని ఇతర దేశాలలో నాన్ -BB2 హిట్. జూన్ 27న రిలీజైన ‘కల్కి 2898 AD’ సినిమా కేవలం 14 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా రూ. 1002 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో వెయ్యి కోట్లు ఆర్జించిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. (Kalki 2898 AD in 1000 Crore Club)


Prabhas.jpg

‘కల్కి 2898 AD’ సినిమాతో తన స్టార్ డమ్ సత్తా ఏంటో చాటారు రెబల్ స్టార్ ప్రభాస్. భారీ పాన్ ఇండియా మూవీస్‌తో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ షేక్ చేయగల స్టామినా ప్రభాస్‌కే సొంతమని చెప్పేందుకు ఈ సినిమా లేటెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది. ఈ సినిమా సాధించిన హిస్టారికల్ సక్సెస్‌తో ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’, ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ‘స్పిరిట్’, హను రాఘవపూడితో ఓ క్రేజీ మూవీ చేస్తున్నారు. (Prabhas Movies)

Read Latest Cinema News

Updated Date - Jul 13 , 2024 | 10:09 PM