HHVM: సెట్స్‌లోకి ఎంటరైన వీరమల్లు.. ఫొటో వైరల్
ABN , Publish Date - Nov 30 , 2024 | 01:10 PM
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీబిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. గత వారం, పది రోజులుగా పవన్ కళ్యాణ్ పేరు వైరల్ అవుతూనే ఉంది. పాలిటిక్స్‌తో పాటు ఆయన సినిమా షూటింగ్స్ కూడా చేస్తూ క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్నారు. తాజాగా ఆయన ‘హరి హర వీరమల్లు’ సెట్స్‌లో అడుగుపెట్టినట్లుగా మేకర్స్ ఓ పిక్ వదిలారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాకు సంబంధించి ఇంకా 18 రోజులు డేట్స్ కేటాయిస్తే చాలు పవన్ కళ్యాణ్ వెర్షన్ షూటింగ్ పూర్తవుతుందనే వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ ఈ మూవీ సెట్స్‌లోకి అడుగు పెట్టబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. మేకర్స్ చెప్పినట్లుగానే వీరమల్లు సెట్స్‌లో ప్రత్యక్షమయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సెట్స్‌లోకి అడుగుపెట్టినట్లుగా తెలుపుతూ.. ‘ధర్మం కోసం జరిగే పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు’ అంటూ మేకర్స్ ఓ పిక్ వదిలారు. ఈ పిక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read-Allu Arjun: ఆర్మీ తెచ్చిన తంట.. అల్లు అర్జున్‌పై పోలీసులకు ఫిర్యాదు
వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ సజావుగా జరిగి ఉంటే.. ఈసరికే ఈ సినిమా విడుదలై ఉండేది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పరంగా బిజీ కావడం, ఎన్నికలు, గెలవడం, మంత్రిగా ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత ప్రజల సమస్యలను పరిష్కరించే క్రమంలో బిజీగా ఉండటంతో.. షూటింగ్స్‌పై దృష్టిపెట్టలేకపోయారు. అయినా సరే.. తనని నమ్ముకున్న నిర్మాతల కోసం.. నెలలో కొన్ని రోజుల పాటు షూటింగ్స్‌కు సమయం కేటాయిస్తూ.. ఆయన అంగీకరించిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మొన్నటి వరకు ఢిల్లీలో పెద్దలని కలిసిన పవన్ కళ్యాణ్, నిన్న కాకినాడలో షిప్‌లో స్మగ్లింగ్ అవుతున్న రేషన్ బియ్యాన్ని పట్టుకుని.. అక్కడి ప్రభుత్వ అధికారులపై మండిపడుతూ ‘సీజ్ ద షిప్’ అంటూ అసలు కాకినాడ పోర్టులో ఏం జరుగుతుందో ప్రజలకు తెలిసేలా చేశారు.
కట్ చేస్తే.. శనివారం ‘హరి హర వీరమల్లు’ సెట్స్‌లో దర్శనమిచ్చారు. అసలాయన టైమింగ్‌కి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఎలా సాధ్యమవుతుందంటూ అంతా పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ నెలలో ఆరు రోజులు షూటింగ్‌లో పాల్గొనేలా నిర్మాతలకు కాల్ షీట్ ఇస్తున్నారని తెలుస్తోంది. ‘హరి హర వీరమల్లు’ పార్ట్ షూట్ చేయడానికి ఇంకా 18 రోజులు సమయం కావాలని చిత్ర యూనిట్ చెబుతోంది. ఏఎం రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలకానుంది. తాజా షెడ్యూల్‌లో దాదాపు 200మంది ఆర్టిసులు పాల్గొననున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. 2025, మార్చి 28న ఈ సినిమాను విడుదల చేసే దిశగా నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
Also Read- Allu Arjun: నన్ను స్టార్‌ను చేసింది ఆయనే..
Also Read-Chai Sobhita: డోల్ డోల్ డోల్ భాజే.. అక్కినేని ఇంట్లో సంబరాలే
Also Read-Prashanth Varma: సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే.. గెట్ రెడీ ఫర్ 'మోక్షజ్ఞ'
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి