Beauty Telugu Movie: ఆకట్టుకునే కన్నమ్మ

ABN , Publish Date - Apr 08 , 2025 | 03:47 AM

అంకిత్ కొయ్య, నీలఖి జంటగా జె.ఎస్.ఎన్. వర్ధన్ తెరకెక్కిస్తున్న ‘బ్యూటీ’ చిత్రం నుంచి విడుదలైన "కన్నమ్మ కన్నమ్మ" పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విజయ్ బుల్గానిన్ సంగీతం, సనారే సాహిత్యం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి

Beauty Telugu Movie: ‘ఆయ్‌’, ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’ ఫేమ్‌ అంకిత్‌ కొయ్య, నీలఖి ప్రధాన పాత్రల్లో జె.ఎ్‌స.ఎన్‌.వర్ధన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బ్యూటీ’. వానరా సెల్యులాయిడ్స్‌, జీ స్టూడియోస్‌, మారుతి టీమ్‌ ప్రొడక్ట్‌ బ్యానర్లపై అడిదాల విజయ్‌పాల్‌రెడ్డి, ఉమేశ్‌.కె.ఆర్‌.బన్సాల్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రం నుంచి విడుదల చేసిన గ్లింప్స్‌, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా, ఈ చిత్రం నుంచి ‘కన్నమ్మ కన్నమ్మ’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. సనారే రచించిన ఈ గీతాన్ని ఆదిత్య ఆర్కే, లక్ష్మీ మేఘన ఆలపించారు. విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించారు.

Updated Date - Apr 08 , 2025 | 03:50 AM