Tattvam Telugu Movie: క్షణక్షణం ఉత్కంఠభరితం
ABN , Publish Date - Apr 08 , 2025 | 03:38 AM
దినేశ్ తేజ్, దష్విక.కె జంటగా అర్జున్ కోల తెరకెక్కిస్తున్న ‘తత్వం’ సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది. అనుకోని సమస్యలలో ఇరుక్కొన్న కథానాయకుడు తెలుసుకున్న జీవన తత్వమే కథాంశం
Tattvam Telugu Movie: దినేశ్ తేజ్, దష్విక.కె జంటగా అర్జున్ కోల తెరకెక్కిస్తున్న చిత్రం ‘తత్వం’. వంశీ సీమకుర్తి నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్.కె.ఎన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు అర్జున్ మాట్లాడుతూ ‘‘కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఊహించని సమస్యల్లో ఇరుక్కున్న కథానాయకుడు.. వాటి నుంచి బయటపడ్డాక తెలుసుకున్న తత్వం ఏంటనేదే చిత్ర కథాంశం’’ అని అన్నారు. ‘‘ప్రతీ సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగే చిత్రమిది’’ అని చిత్రనిర్మాత వంశీ సీమకుర్తి చెప్పారు.